వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్? వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఆడిన 204 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ చూసి ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టాయో లేదో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం నవ్వుల పువ్వులు పూస్తున్నాయి. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు బాదేయడంతో ఈ 15 ఏళ్ల కుర్రాడి బ్యాట్‌కు ఏమైనా ఏఐ చిప్స్ బిగించారా అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ వేసిన సెటైర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

బౌలర్ ఎవరైనా బాదుడే.. వైభవ్ బ్యాటింగ్ వెనుక అసలు టాలెంట్ ఇదే!
బౌలర్ ఎవరైనా బాదుడే.. వైభవ్ బ్యాటింగ్ వెనుక అసలు టాలెంట్ ఇదే!

జెన్సన్ హువాంగ్ రాకతోనే చిప్స్ వచ్చాయా?
యూఏఈ-ఏ జట్టుపై జరిగిన కీలక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే వేగవంతమైన లిస్ట్-ఏ డబుల్ సెంచరీ, 28 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి రికార్డుల దుమ్ముదులిపాడు. మొత్తం 28 సిక్సర్లు, 7 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఊచకోతపై స్పందించిన ఐస్‌లాండ్ క్రికెట్.. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ను కూడా లాక్కొచ్చింది. "మంగళవారం జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈవోగా తిరిగి వచ్చారు. బుధవారం వైభవ్ సూర్యవంశీ బ్యాట్ లో ఏఐ చిప్స్ మళ్లీ పనిచేశాయి.. ఇది కచ్చితంగా యాదృచ్ఛికం కాదు" అంటూ ఎక్స్ వేదికగా సరదా పోస్ట్ చేసింది. బంతిని టచ్ చేస్తే చాలు సిక్సర్‌గా మారిపోతుండటంతో చెక్క బ్యాట్‌తో ఇది సాధ్యమేనా అనే ఫన్నీ అనుమానాలు నెటిజన్లలోనూ వ్యక్తమవుతున్నాయి.

Nvidia AI Chips in Vaibhav Sooryavanshi Bat Iceland Cricket Post Goes Viral After 204 Full Details
నువ్వే నాకు స్పూర్తి- వైభవ్ పై టీ20 మాజీ కెప్టెన్- నాకు ఆయనే అన్న బుడ్డోడు.!
నువ్వే నాకు స్పూర్తి- వైభవ్ పై టీ20 మాజీ కెప్టెన్- నాకు ఆయనే అన్న బుడ్డోడు.!

పోలికలు వద్దు.. ఆడనివ్వండి: గంగూలీ సీరియస్ అడ్వైజ్
సోషల్ మీడియాలో ఏఐ చిప్స్, రికార్డుల హడావిడి ఉలా ఉంటే.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం కుర్రాడిని ప్రశాంతంగా ఆడనివ్వాలని సూచించారు. ఐపీఎల్, ఇండియా-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు అద్భుతంగా ఉందని, అతను భారత క్రికెట్ భవిష్యత్తు అని కొనియాడారు. అయితే అనవసర పోలికలు మాత్రం వద్దని సౌరవ్ గంగూలీ హితవు పలికారు. 15-16 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద ప్రదర్శనలు చేస్తున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కు తనదైన స్టైల్లో ఎదిగే అవకాశం ఇవ్వాలని, ఒత్తిడి లేకుండా ఆడనివ్వాలని స్పష్టం చేశారు. మొత్తానికి బ్యాట్ లో ఏఐ చిప్స్ ఉన్నాయో లేదో కానీ.. వైభవ్ ఆటతీరు మాత్రం హై-స్పీడ్ ప్రాసెసర్‌లా దూసుకుపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+