నువ్వే నాకు స్పూర్తి- వైభవ్ పై టీ20 మాజీ కెప్టెన్- నాకు ఆయనే అన్న బుడ్డోడు.!

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంలో భారత ఏ జట్టుకు ఆడుతున్న టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) నిన్న దుబాయ్ తో మ్యాచ్ లో పెను విధ్వంసం సృష్టించాడు. మహామహులైన బ్యాట్స్ మెన్ కే సాధ్యం కాని విధంగా ఏకంగా 53 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో భారత క్రికెట్లో దిగ్గజాల సరసన చేరిపోయాడు. దీంతో వైభవ్ ను సీనియర్లు, జూనియర్లన్న తేడా లేకుండా అంతా ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదే క్రమంలో భారత టీ20 మాజీ కెప్టెన్ సైతం తనకు వైభవ్ ఆదర్శమని ఎలాంటి భేషజాల్లేకుండా ప్రకటించాడు. అయితే వైభవ్ మాత్రం తనకు ఎవరు ఆదర్శమో చెప్పేశాడు.

Ind vs NZ: న్యూజీలాండ్ లో టీమిండియా మరో చరిత్ర- 96 ఏళ్లలో ఇదే తొలిసారి..!
Ind vs NZ: న్యూజీలాండ్ లో టీమిండియా మరో చరిత్ర- 96 ఏళ్లలో ఇదే తొలిసారి..!

యూఏఈపై వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ ప్రదర్శన తర్వాత భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు నువ్వు నాకు స్ఫూర్తివి. అద్భుతమైన ఆటగాడివి! #special" అని భారత్ తరపున టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. అయితే వైభవ్ మాత్రం తన స్ఫూర్తి ఎవరో కూడా వెల్లడించాడు. నిన్న మ్యాచ్ తర్వాత తాను నలుగురు వ్యక్తులతో మాట్లాడానని, ఇందులో తన నాన్న, నా చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా, అలాగే అండర్-19 రోజుల్లో తనతో పాటు ఉన్న నా చిన్ననాటి స్నేహితుడు ప్రథమ్ జాచక్‌, మరో వ్యక్తి యువరాజ్ సింగ్ అన్నాడు.

Suryakumar Yadav Calls Vaibhav Sooryavanshi His Inspiration After Historic 204 Youngster Reveals Yuvraj Singh Connection
Ind vs NZ: భారత బ్యాటర్ల చారిత్రక ఫీట్- 94 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి..!
Ind vs NZ: భారత బ్యాటర్ల చారిత్రక ఫీట్- 94 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి..!

గతంలో బ్యాటింగ్‌కు సంబంధించి ఆయన తనకు చాలా విషయాలు చెప్పారని, తాను చాలా ఆందోళనలో ఉన్నానని, అందుకే ఆయనతో చాలా బహిరంగంగానే సమస్యలను పంచుకున్నానని వెల్లడించాడు. బ్యాటింగ్‌కు వెళ్ళినప్పుడు తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చెప్పానని, అప్పుడు ఆయన అరగంట పాటు తనకు ప్రతి విషయాన్ని వివరంగా వివరించారని వైభవ్ పేర్కొన్నాడు. ఒకవేళ నువ్వు కనీసం 20 బంతులు ఆడితే, స్కోరు పూర్తిగా భిన్నంగా ఉంటుందని యువీ చెప్పినట్లు వైభవ్ తెలిపాడు. అలాగే బ్యాటింగ్‌కు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను కూడా వివరించారని, అవి తనకు ఎంతో సహాయపడ్డాయని తెలిపాడు.
యువరాజ్ సర్‌తో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిందని, ఆయన తన ఆరాధ్య దైవమని వైభవ్ తెలిపాడు. మనకు నచ్చిన వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు, వారి మాటల్లోని ప్రతి అక్షరాన్ని మనం శ్రద్ధగా వింటాం కదా! ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారన్నాడు. తన బ్యాటింగ్ వీడియోలను చూస్తున్నప్పుడు, తాను అవే తప్పులు చేస్తున్నానని గమనించానని, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించానన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+