కొత్త పెన్షన్ల లబ్దిదారులకు బిగ్ అప్డేట్- నగదు జమ వేళ ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ పైన తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 19వ తేదీనే వారి ఖాతాల్లో తొలుత నగదు జమ చేయాలని నిర్ణయించింది. వారికి మంజూరు పత్రాలను ఇప్పటి కే అందించారు. అయితే, పెన్షన్ల జమతో పాటుగా ఇందిరమ్మ చీరల పంపిణీకి ఈ నెల 26వ తేదీ ముహూర్తంగా ఖరారు చేసారు. ఈ సమయంలో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సూచనల మేరకు కొత్తగా 10 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిజమైన లబ్దిదారులను గుర్తించారు. 360 డిగ్రీస్‌లో విచారణ చేపట్టిన అనంతరం 4.72 లక్షల మంది అర్హత సాధించినట్లు గుర్తించారు. వీరందరికీ ఇప్పటికే మంజూరు పత్రాలు కూడా అందించారు. నవంబర్ 26న అచ్చంపేట సభలో సీఎం రేవంత్ బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేయనున్నారు. చేయూత పథకం ద్వారా ప్రభుత్వం రూ.2 వేల పింఛన్ అందిస్తోంది. అదే విధంగా అచ్చంపేట సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా రేవంత్ ప్రారంభించనున్నారు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
ప్రభుత్వం ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు నవంబర్ 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు ఇందిరమ్మ జీవిత బీమా పథకం కూడా ప్రారంభించాల్సి ఉండటంతో.. చీరల పథకం వాయిదా వేశారు. రేపు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. కోటి మంది మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే మండల కేంద్రాలకు చీరలు చేరుకున్నాయి. ప్రత్యేక కేంద్రాల ద్వారా వీటిని మహిళలకు అందించనున్నారు. మహిళలు తమ ఆధార్ కార్డును తీసుకెళ్లి వీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతీ గ్రామంలో రేషన్ షాపుల వద్ద వీటిని అందించనున్నారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చీరల పంపిణీ చేయటం ఇది రెండో సారి.













Click it and Unblock the Notifications
