ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్యవీర్ సెహ్వాగ్: ఎవడు కొంటాడో గానీ.. !!

ఐపీఎల్ మినీ వేలం గడువు దగ్గరపడుతోంది. డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరుగనున్న ఈ వేలం కోసం మొత్తం 1,220 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు అనేక మంది యువ క్రికెటర్లు ఈ జాబితాలో ఉన్నారు. 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 66 ప్లేయర్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఇందులో 25 మంది విదేశీ ఆటగాళ్ల స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

బీసీసీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 939 మంది భారతీయులు, 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 170 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 42 మంది అసోసియేట్ దేశాలకు చెందినవాళ్లు ఉన్నారు. మిగిలిన వారు ఇంకా అంతర్జాతీయంగా అరంగేట్రం చేయని అన్‌క్యాప్డ్ క్రికెటర్లుగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 66 మందిని మాత్రమే తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో కాంపిటీషన్ గట్టిగానే ఉండొచ్చు.

Aaryavir Sehwag and Mohit Ulva is among the Indian names in 1220 registered players for IPL auction

రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ బ్రాకెట్ లో బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. స్టోక్స్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. చివరిగా 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. 2026 వేలంలో వార్నర్ ఉన్నప్పటికీ.. ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయలేదు దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్స్ ఆడాడు. అక్కడ రాణించడంతో ఈ సారి అతనికి అవకాశం లభించొచ్చు.

రియాద్ ఫైనాన్షియల్ టవర్స్ పై భీకర దాడి
రియాద్ ఫైనాన్షియల్ టవర్స్ పై భీకర దాడి

ఇదే రూ. 2 కోట్ల కేటగిరీలో టీమిండియా పేసర్లు ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, న్యూజిలాండ్ ఆటగాళ్లు డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక పేసర్ మతీశ పాతిరణ, వనిందు హసరంగ, వెస్టిండీస్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్మెయిర్, షై హోప్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో కూడా నిలిచారు.

టీటీడీ ఛైర్మన్ పదవి ఖాళీ అయిన వేళ.. తిరుమలలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ
టీటీడీ ఛైర్మన్ పదవి ఖాళీ అయిన వేళ.. తిరుమలలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ

వీరందరి కంటే కూడా.. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రత్యేక ఆకర్షణగా కాబోతోన్నాడు. ఐపీఎల్ ఆక్షన్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఇటీవల ఒమన్ లో జరిగిన అండర్ 19 ఆసియా కప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆర్యవీర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు.

ఆర్యవీర్‌తో పాటు ఆసియా కప్ ఫైనల్ లో మెరిసిన మోహిత్ ఉల్వా, కావ్యన్ పటేల్ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో నమోదు చేసుకుని ఐపీఎల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి 11 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నప్పటికీ ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకీబ్ అల్ హసన్, నాహిద్ రాణా వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో లేవు. ఈ రిజిస్ట్రేషన్ జాబితా ఫైనల్ కాదని, ఫ్రాంచైజీల ప్రాధాన్యతల ఆధారంగా దీన్ని కుదించి తుది షార్ట్‌లిస్ట్‌ను త్వరలో విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+