26 ఏళ్ల తర్వాత 'గోల్డ్ స్పాట్' రీ ఎంట్రీ.. కోకా కోలా మాస్టర్ ప్లాన్..! అంబాసిడర్ గా ధోనీ..?
'గోల్డ్ స్పాట్'.. ఈ పేరు చెబితే 90's కిడ్స్ కు నోరూరుతుంది. అప్పట్లో భారతీయ యువతను, చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది ఈ ఆరెంజ్ సాఫ్ట్ డ్రింక్.. అయితే ఈ డ్రింక్ దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు కోకా కోలా సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఎంఎస్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో ధోనీ ఈ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉండబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆరోగ్య కారణాల దృష్ట్యా మార్కెట్ లో హెల్దీ, షుగర్-ఫ్రీ పానీయాలకు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో గోల్డ్ స్పాట్ డ్రింక్ ను తక్కువ చక్కెర లేదా జీరో షుగర్ విభాగంలో తిరిగి ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే గోల్డ్ స్పాట్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాత ట్యాగ్ లైన్ అయిన ది జింగ్ థింగ్ ను అలాగే కొనసాగించాలని కోకా కోలా సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దానివల్ల గతంలో ఈ పానీయాన్ని ఇష్టపడిన వినియోగదారులను మళ్లీ ఆకర్షించడమే కాకుండా ఇటు కొత్త తరం యువతకు కూడా బ్రాండ్ ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు స్పష్టం అవుతోంది.
Gold Spot is making a comeback!The iconic orange fizzy drink, first introduced by Parle, is reportedly returning after 26 years.Acquired by Coca-Cola in 1993 and discontinued in 2000 to make way for Fanta, Gold Spot could soon be back on shelves in a new low-sugar avatar.For those who grew up with “The Zing Thing,” this is a little piece of nostalgia coming back.
— Mumbai Heritage (@mumbaiheritage) November 23, 2026
ఇక గోల్డ్ స్పాట్ ను 1953 లో పార్లే సంస్థ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 1993లో కోకా కోలా సంస్థ పార్లేకు చెందిన గోల్డ్ స్పాట్ డ్రింక్ తో పాటు థంబ్స్ అప్, లిమ్కా, మాజా బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇక అప్పటికే తన దగ్గర ఫాంటా ఉండటంతో.. అదే కేటగిరీలో మార్కెట్ లో పోటీని తగ్గించుకునే ప్లాన్ లో భాగంగా 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ ఉత్పత్తిని నిలిపివేసింది.












Click it and Unblock the Notifications
