ఏపీ మామిడి రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.35 వేలు.. దరఖాస్తు విధానం ఇదే!

ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల ఏటా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న మామిడి రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక హెచ్చుతగ్గులు, బలమైన ఈదురుగాలుల బారి నుంచి తోటలకు భరోసానిస్తూ 2026-27 సీజన్‌కు సంబంధించి పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉద్యాన శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతులకు ఎకరాకు గరిష్ఠంగా రూ. 35,000 వరకు బీమా రక్షణ లభిస్తుంది. ఇందుకోసం సాగుదారులు తమ వాటాగా ఎకరాకు రూ. 1,650 నుంచి రూ. 2,250 మధ్య ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

AP Mango Crop Insurance 2026-27 Rs 35 000 Coverage Per Acre to farmers How to Apply know full details

సగటున రూ. 1,750 చెల్లించడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టానికి పరిహారం పొందే అవకాశం కలుగుతుంది. ఆసక్తి గల రైతులు డిసెంబర్ 31, 2026 లోగా తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా రక్షణ కాలపరిమితిని వేర్వేరుగా నిర్ణయించారు. అకాల వర్షాలు, అధిక వర్షపాతం వల్ల పూత లేదా పిందె దశలో నష్టం వాటిల్లితే 2026 డిసెంబర్ 15 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు బీమా వర్తిస్తుంది.

అలాగే తెగుళ్లు, చీడపీడల వ్యాప్తికి దారితీసే ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా ఇందులో చేర్చారు. ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పుల వల్ల కలిగే నష్టాలకు 2027 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు, బలమైన గాలుల వల్ల కాయలు రాలిపోయి నష్టం జరిగితే మార్చి 1 నుంచి మే 31, 2027 వరకు పరిహారం పొందే వీలుంది.రైతులు తమకు వీలైన మార్గంలో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మూడు వెసులుబాట్లు కల్పించింది.

స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు పీఎంఎఫ్‌బీవై క్రాప్ ఇన్సూరెన్స్ మొబైల్ యాప్ ద్వారా నేరుగా వివరాలు నమోదు చేయవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, మండల ఉద్యాన శాఖ అధికారుల సహాయంతోనూ దరఖాస్తు పూర్తి చేయవచ్చు.

దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ నకలు, భూమి పాస్‌బుక్ లేదా 1-బీ పత్రం, మామిడి సాగు స్వీయ ధ్రువీకరణ పత్రం, కౌలు రైతులైతే కౌలు గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది.

తెలంగాణాలో పలు జిల్లాలకు వర్ష సూచన.. బంగాళాఖాతం ద్రోణి హెచ్చరిక!
తెలంగాణాలో పలు జిల్లాలకు వర్ష సూచన.. బంగాళాఖాతం ద్రోణి హెచ్చరిక!

పూత దశలో కురిసే మంచు, అకాల వర్షాలు, వేసవి ఆరంభంలో వీచే వడగాలులు మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే బీమా ప్రీమియం చెల్లించి, తమ తోటలకు రక్షణ కల్పించుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+