వైభవ్ సూర్యవంశీ శివతాండవం: 28 సిక్సర్లు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఏఈతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. క్రీజ్ లోకి వచ్చిన మరుక్షణం నుంచే స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడీ లెఫ్ట్ హ్యాండర్. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అక్కడితో అతని పరుగుల సునామీకి బ్రేకులు పడలేదు. అదే విధ్వంసాన్ని కొనసాగించాడు. 52 బంతుల్లో 204 పరుగులు చేశాడు.

యూఏఈ జట్టు నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత ఏ జట్టు తరఫున ఓపెనర్‌గా దిగిన వైభవ్.. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ రికార్డ్ సెంచరీలో ఏకంగా 14 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అంటే.. వీటి ద్వారానే 100 పరుగులను రాబట్టుకున్నాడు. అతని అద్భుత బ్యాటింగ్ దాడికి యూఏఈ బౌలింగ్ లైన్ అప్ తీవ్రంగా ఒత్తిడికి లోనైంది. బౌలర్లు బిత్తరపోవాల్సి వచ్చింది.

Vaibhav Sooryavanshi smashed a 28-ball 200 century broke all time leading India A chase 250 on UAE

ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ద్వారా 50 ఓవర్ల లిస్ట్ ఏ, వన్డే క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ 2015 జనవరి 18న వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేసి ఈ అగ్రస్థానంలో నిలిచాడు. డివిలియర్స్ పేరిట సుదీర్ఘంగా 11 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆ అరుదైన ప్రపంచ రికార్డును వైభవ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే కొల్లగొట్టాడు.

పాకిస్తాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిస్తోన్న చైనా- భారత్ కు ధీటుగా
పాకిస్తాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిస్తోన్న చైనా- భారత్ కు ధీటుగా

క్రికెట్ చరిత్రలోని అన్ని ఫార్మాట్ల ఆధారంగా చూస్తే.. అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ప్రపంచ బ్యాటర్లలో వైభవ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 2024 జూన్‌లో సైప్రస్‌పై 27 బంతుల్లోనే టీ20 శతకం సాధించి ఆల్‌టైమ్ రికార్డుతో మొదటి స్థానంలో ఉన్నాడు. వైభవ్ ఒక్క బంతి తేడాతో ఆ ప్రపంచ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అయినప్పటికీ.. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ (30 బంతులు), అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ శర్మ (30 బంతులు) సాధించిన రికార్డులను అలవోకగా దాటేశాడు.

టీ20లో 19 సిక్సర్లు, 181 పరుగులు: ఐపీఎల్ స్టార్ ప్లేయర్ పవర్ హిట్టింగ్: దెబ్బకు రికార్డ్ స్కోర్
టీ20లో 19 సిక్సర్లు, 181 పరుగులు: ఐపీఎల్ స్టార్ ప్లేయర్ పవర్ హిట్టింగ్: దెబ్బకు రికార్డ్ స్కోర్

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ సూర్యవంశీ తిరగరాశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన రికార్డు గతంలో బోవ్స్ పేరిట ఉండేది. 2024 అక్టోబర్‌లో ఫోర్డ్ ట్రోఫీలో కాంటర్‌బరీ తరఫున ఆడుతూ ఒటాగోపై బోవ్స్ 103 బంతుల్లో ద్విశతకం పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 110 బంతుల్లో 205 పరుగులు చేశాడు. వైభవ్ కేవలం 52 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకుని బోవ్స్ రికార్డును దాదాపు సగం బంతుల్లోనే అధిగమించాడు.

లిస్ట్-ఎ, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగవంతమైన ద్విశతకాలు సాధించిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో అనేక మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్, భారత ఆటగాడు నారాయణ్ జగదీసన్ 114 బంతుల్లో డబుల్ సెంచరీలు సాధించారు. శుభ్‌మన్ గిల్ 117 బంతుల్లో ద్విశతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దిగ్గజాలందరినీ వెనక్కి నెట్టి వైభవ్ అగ్రస్థానంలో నిలిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+