వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ లు.. తెలుగులో 100 శాతం స్ట్రైక్ రేట్.. నువ్ గ్రేటన్నా..!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. పేరుకే మలయాళ హీరో అయినా తెలుగులో 100శాతం స్ట్రైక్ రేట్ తో విజయాలను అందుకుంటున్నారు. మహానటి మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత తాజాగా విడుదలైన ఆకాశంలో ఒక తార సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా తెలుగులో చేసిన నాలుగు సినిమాలూ మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ లో 100 శాతం స్ట్రైక్ రేట్ ఉన్న హీరోగా ఆయన దూసుకెళ్తున్నారు.
ఇక ఆయన తాజాగా నటించిన ఆకాశంలో ఒక తార చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్.. వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అలాగే సాత్విక వీరవల్లి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆకాశంలో ఒక తార చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అయితే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఏర్పడినప్పటికీ మూవీ సైలెంట్ గానే రిలీజ్ అయింది. దాంతో తొలి రోజు నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రాలేదు. కానీ రెండోరోజు నుంచి మౌత్ టాక్ తో మూవీ పికప్ అయింది.

ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి మొదటి సోమవారం రోజున 'ENE రిపీట్' మూవీ కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 6 రోజుల్లో రూ. 11 కోట్ల 43 లక్షల రూపాయిల గ్రాస్ ను రాబట్టగా.. రూ. 6 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం అందుతోంది. రానున్న రోజుల్లో ఈ మూవీ సులభంగా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications
