మేషరాశి, మిథున రాశి, వృషభ రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో మేషరాశి, మిథున రాశి, వృషభ రాశివారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం. ఈ నెలలో రాహు-కేతువులు రాశులు మారుస్తుండగా, మీనంలో శని మారుతున్నారు, సింహంలో గురువు వక్రగతికి వెళ్తున్నారు. వీటితో పాటు సూర్యుడు, బుధుడు కూడా కీలక సంచారాలు చేస్తున్నారు.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
రాహువు దశమ స్థానంలోకి రావడం, శని మార్గిగా మారడం వల్ల వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు పెరిగినా ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేస్తారు. ఉగులకు పైఅధికారుల ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు లాభనష్టాలను స్పష్టంగా బేరీజు వేసుకోవాలి. నెల ద్వితీయార్థంలో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉన్నా ప్రయాణాలు, ఇతర అవసరాల వల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశాలు లభిస్తాయి. మాటల్లో తొందరపాటు లేకుండా ఓపికగా వ్యవహరిస్తే సంబంధాలు మెరుగుపడతాయి. పని ఒత్తిడి, నిద్రలేమి వల్ల అలసట వేధించవచ్చు. విశ్రాంతి, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి లేదా శ్రీ ఆంజనేయస్వామిని ఆరాధించడం మంచిది.

వృషభ రాశి (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)
డిసెంబరు నెలలో వృషభ రాశి వారికి అవకాశాలు, జాగ్రత్తలు కలగలిసి ఉంటాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా పురోగతి కనిపించినా నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు. మీ శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి, కానీ భారీ పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ధన ప్రవాహం బాగానే ఉన్నప్పటికీ పొదుపు వైపు మొగ్గు చూపాలి. అనవసరమైన విలాసాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భాగస్వామితో అనుబంధం బలపడుతుంది, అయితే పట్టుదల తగ్గించుకుని అవతలి వారి అభిప్రాయాన్ని గౌరవించడం ముఖ్యం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని లేదా శివపార్వతులను పూజించడం అనుకూలం.
మిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
మిథున రాశి వారికి డిసెంబరు నెలలో పనితీరులో వేగం, ఆలోచనల్లో స్పష్టత పెరుగుతాయి. కేతువు సంచారం మీ స్వయంకృషిని పెంచుతుంది. ఉద్యోగంలో కీలక ప్రాజెక్టులపై పని చేసే అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు, ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అయితే ఇతరులకు హామీ ఉండటం లేదా అప్పులు ఇవ్వడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చర్చల ద్వారా పాత అపార్థాలను సులభంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల అండదండలు మీకు నైతిక బలాన్ని ఇస్తాయి. మానసిక ఒత్తిడి లేదా ఆలోచనల భారం కొంత అలసట కలిగించవచ్చు. ధ్యానం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గణపతిని ఆరాధించడం మంచిది.














Click it and Unblock the Notifications
