ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు లో కీలక మార్పులు - ఇక నుంచి ఇలా..!!
ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసు వ్యవహారా ల్లో కీలక నిబంధలను సడలించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న సెలవుల మంజూరు ప్రక్రియ లో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత విధానానికి స్వస్తి పలికి పూర్తిగా మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక నుంచి సెలవుల మంజూరు విధానం పారదర్శకంగా ఉండేందుకు నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగు ల సర్వీసు వ్యవహారాల్లో పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మాన్యువల్ పద్ధతిలో సాగుతున్న సెలవుల మంజూరు ప్రక్రియకు స్వస్తి పలుకింది. ఇక నుంచి పూర్తిస్థాయిలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై ఉపాధ్యాయులు, సిబ్బంది తమ సెలవుల దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉండగా, అధికారులు సైతం డిజిటల్ విధానంలోనే వాటిని పరిశీలించి ఆమోదించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఇందు కోసం విధి విధానాలను వెల్లడించారు.

తాజా మార్పులతో ఇక నుంచి
ఈ మేరకు సెలవులను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (IFMIS) పోర్టల్లోని 'EHRMS' మాడ్యూల్ ద్వారా మంజూరు చేయాలని స్పష్టం చేసారు. అదే విధంగా ఉపాధ్యాయుల సెలవులకే పరిమితం కాకుండా, ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఈ-పెన్షన్ వంటి కీలక సర్వీసు సేవలన్నింటినీ ఇదే పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. ఈ డిజిటల్ విధానం ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుందని చెప్పారు. దరఖాస్తుల స్థితిగతులు, ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించే అవకాశం కలగనుంది.













Click it and Unblock the Notifications
