"ఆ రోజే వస్తున్నా..ఫ్లైట్ పంపండి..!"- ఉరి ముప్పు వేళ బంగ్లా సర్కార్ కు హసీనా ..!

బంగ్లాదేశ్ లో రెండున్నరేళ్ల క్రితం తలెత్తిన విద్యార్దుల తిరుగుబాటు నేపథ్యంలో పదవీచ్యుతురాలై, దేశం విడిచిపారిపోయి భారత్ కు వచ్చి తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఢాకాకు వెళ్లే తేదీని ఆమె ఖరారు చేశారు. అలాగే తాను తిరిగి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్ధించారు. దీనిపై బంగ్లా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

భారత్ నుంచి రాగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష..? బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక చర్చలు..!
భారత్ నుంచి రాగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష..? బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక చర్చలు..!

ఓవైపు స్వదేశంలో విద్యార్ధుల కాల్చివేత కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న షేక్ హసీనా.. మరోవైపు హసీనా రాకకు ముందే రోడ్లపైకి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్న ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, నేతలు.. ఇలాంటి పరిస్ధితుల్లో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఈ మాజీ ప్రధాని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం డిసెంబర్ 16న ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఆ రోజు తాను న్యూఢిల్లీ నుంచి ఢాకాకు తిరిగి వచ్చేందుకు బంగ్లాదేశ్ జాతీయ విమానయానసంస్ధ బిమన్ విమానాన్ని భారత్ కు పంపాలని ఆమె అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. దీంతో హసీనా రిటర్న్ పై మరింత స్పష్టత వచ్చినట్లయింది.

Sheikh Hasina Announces December 16 Return to Bangladesh Seeks Biman Flight From Delhi
Sheikh Hasina: హసీనా అప్పగింతకు భారత్ కీలక షరతులు..! సైనిక విమానం, ఆర్మీ ఆహ్వానం?
Sheikh Hasina: హసీనా అప్పగింతకు భారత్ కీలక షరతులు..! సైనిక విమానం, ఆర్మీ ఆహ్వానం?

డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను భారత్ విడదీసింది. దీంతో ఆరోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు అదే రోజు భారత్ నుంచి బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లేందుకు హసీనా సిద్దమవుతున్నారు. ఇప్పటికే తనకు కొత్త పాస్ పోర్టు, ఇతర పత్రాలు మంజూరు చేయాలంటూ హసీనా చేసుకున్న దరఖాస్తును అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద భారత్ ఆమెను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించలేదు. అదే సమయంలో బంగ్లా ప్రభుత్వమే తనకు విమానం పంపాలంటూ హసీనా కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలో షేక్ హసీనాను భారత్‌కు తరలించిన నేపథ్యంలో, ఆమె ఇప్పుడు ఢిల్లీ నుండి తిరిగి ఢాకాకు వెళ్లేందుకు విమాన రవాణా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆమె ప్రతినిధి తెలిపారు.రాజ్యాంగ విరుద్ధంగా ఆమెను అటువంటి పరిస్థితుల్లో దేశం నుండి పంపినందున, డిసెంబర్ 16న వచ్చే 'విజయ దినోత్సవం' (Victory Day) రోజున ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+