కేంద్రమంత్రి షాకింగ్ వ్యాఖ్యలతో డైలమాలో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2!

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు నిధుల సమీకరణ అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించే వ్యవహారం తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణం మంజూరు చేసే ప్రతిపాదన గురించి కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠి సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ నిర్మాణానికి అనుమతులు, నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో కేంద్రమంత్రిని కలిశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. సాధారణంగా దేశంలోని మెట్రో రైలు ప్రాజెక్టులన్నీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో కొనసాగుతుంటాయి. రైల్వే శాఖకు, మెట్రో కార్పొరేషన్ల నిధుల కేటాయింపులకు ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడంతో అశ్వినీ వైష్ణవ్‌ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Hyderabad Metro Phase 2 in a dilemma following shocking remarks by Union Minister Ashwini Vaishnaw

హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సుమారు 76 కిలోమీటర్ల మేర ఐదు కొత్త కారిడార్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపు రూ.24 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది. నిధుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగే తీరుపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.

నాగార్జునసాగర్‌ జలాల పంపిణీపై ఏపీ వర్సెస్ తెలంగాణా..త్రిసభ్య కమిటీ భేటీలో జరిగిందిదే!
నాగార్జునసాగర్‌ జలాల పంపిణీపై ఏపీ వర్సెస్ తెలంగాణా..త్రిసభ్య కమిటీ భేటీలో జరిగిందిదే!

మరోవైపు దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్రమంత్రి వివరించారు. అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది మే నెలలో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ నాటికి రైలు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని, 2029 నాటికి థానే వరకు పూర్తిస్థాయి సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. సరకు రవాణా సంస్కరణల ద్వారా రైల్వేకు రూ.1,078 కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని, టికెట్‌ బుకింగ్ వ్యవస్థను ఆధునీకరించామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+