వంగవీటి రాధాకృష్ణ అసలు పేరు- మేయర్ గా ప్రమాణ స్వీకారం వేళ..!!
వంగవీటి రాధా విజయవాడ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసారు. జనసేన నుంచి భారీ మెజార్టీతో మేయర్ గా గెలిచన రాధా కొత్త బాధ్యతలు ప్రారంభించారు. మేయర్ గా ప్రమాణ స్వీకారం వేళ వంగవీటి రాధా తన అసలు పేరు బయట పెట్టారు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా ఆసక్తి కర చర్చగా మారింది. ఇక.. మేయర్ గా బాధ్యతలు చేపడుతూనే రాధా కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు.
విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అందరికీ వంగవీటి రాధాకృష్ణ గానే ఆయన పేరు తెలుసు. అయితే, మేయర్ గా ప్రమాణ స్వీకారం సమయంలో తన పేరు ప్రస్తావిస్తూ.. వంగవీటి రాధాకృష్ణ అని కాకుండా వంగవీటి రాధాకృష్ణన్ అని చదివారు. ఆయనకు తల్లిదండ్రులు పెదనాన్న రాధాకృష్ణమూర్తి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టారు. అయితే ఆయన తమిళనాడులోని ఊటీ స్కూల్‌లో చదువుకునే సమయంలో అక్కడి రికార్డుల్లో ఆయన పేరును రాధాకృష్ణన్‌గా నమోదు చేశారు. అలా రికార్డుల్లో నమోదు కావడంతో రాధాకృష్ణన్‌గానే కొనసాగుతూ వస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లలో సైతం రాధాకృష్ణన్‌గానే ఉంది. అంతేకాదు ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొంతమంది రాధాకృష్ణన్‌గా ప్రస్తావించారు.

వంగవీటి సమర్థతకు పరీక్షగా
దీంతో... ఈ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కార్పొరేటర్లు వారి పేర్ల ప్రకారం ప్రమాణం చేశారు. తరువాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహిం చారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మేయర్ రాధాకృష్ణన్‌తోపాటు ఎక్స్‌అఫీషియో, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ 12వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీని డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత వంగవీటి రాధా తిరిగి పదవిలోకి వచ్చారు. టీడీపీలో కొనసాగుతూ జనసేన నుంచి మేయర్ గా గెలిచారు. రెండు పార్టీల నేతలతోనూ సఖ్యత గా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇక, ఇప్పుడు మేయర్ గా వంగవీటి తన సమర్ధత ఏ విధంగా నిరూపణ చేసుకుంటారనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications
