భారీ భూకంపం- వణికిన భారత్ సరిహద్దు ప్రాంతం

భారత్, నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. తూర్పు నేపాల్‌ కొండ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. ఈ భూప్రకోపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు తెలుస్తోంది.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 గా రికార్డయింది. నేపాల్‌లోని తాప్లేజంగ్, భారత్ లోని సిక్కింలో గల మంగన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. నేపాల్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:17 నిమిషాలకు 27.832 ఉత్తర అక్షాంశం, 87.946 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది.

Earthquake of magnitude 5 3 Jolts morning with its epicenter around the Sikkim border eastern Nepal

ఈ భూకంప కేంద్రం సిక్కింలోని గెయిజింగ్ పట్టణానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల దీని చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా నమోదయ్యాయి. దీని తీవ్రత పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్‌లోనూ కనిపించింది. గాంగ్టక్, గెయిజింగ్, డార్జిలింగ్, కుర్సియాంగ్, కాలింపాంగ్ తదితర కొండ ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించడంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

నేడు కార్తీక పౌర్ణమి- భరణీ దీప దర్శనంతో పులకించిన అరుణాచలం
నేడు కార్తీక పౌర్ణమి- భరణీ దీప దర్శనంతో పులకించిన అరుణాచలం

భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలోని పాత్రలు, ఫర్నిచర్ తీవ్రంగా కదిలిపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నేపాల్‌లోని పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలైన తారాయ్ జిల్లాల్లోనూ ప్రకంపనల ధ్వని స్పష్టంగా వినిపించిందని స్థానికులు వెల్లడించారు.

ఈ నెల 30న తిరుపతిలో టీటీడీ భారీ కార్యక్రమం
ఈ నెల 30న తిరుపతిలో టీటీడీ భారీ కార్యక్రమం

హిమాలయ పర్వత శ్రేణుల్లో పరిధిలోకి వచ్చే ఈ సరిహద్దు ప్రాంతాలు భౌగోళికంగా అత్యంత సున్నితమైనసీస్మిక్ జోన్ కిందికి వస్తాయి. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ వైపు కదులుతుండటం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ ఒత్తిడి అధికంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల తక్కువ లోతులో కేంద్రీకృతం కావడం వల్లే ప్రకంపనల తీవ్రత ఉపరితలంపై ఎక్కువగా కనిపించిందని సెస్మాలజీ సెంటర్ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+