అక్రమ అండాల సేకరణ కేసులో వైద్యులకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు..

తెలంగాణలో ఇటీవల సంచలనంగా మారిన అక్రమ అండాల సేకరణ కేసులో వైద్యులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి పద్మజ ఫెర్టిలిటీ సెంటర్‌ కు చెందిన డాక్టర్ పద్మజ పాల అలాగే సద్గురు హెల్త్‌ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన డాక్టర్ గేదెల దుర్గారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

వీళ్లు అమాయకులైన యువతులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ల నుంచి అక్రమంగా అండాలు సేకరించి.. వాటిని సంతాన సాఫల్య చికిత్సలో ఉపయోగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు కే వివేక్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో వాదించారు.

మరోవైపు ఈ కేసుపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన పేద, అమాయక యువతులను హైదరాబాద్ కు తరలించి వాళ్లకు అధిక మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆపైన వాళ్ల నుంచి రూల్స్ కు విరుద్ధంగా అండాలు సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లలో ఉపయోగిస్తున్నారని వాదించారు. ఇక ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేవేసింది.

Telangana Big shock for doctors in the Telangana illegal eggharvesting case bail petitions rejected

ఇక తీర్పును నవంబర్ 23వ తేదీకి రిజర్వ్ చేస్తూ జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిని పట్టుకుని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ అండాల సేకరణ వ్యవహారం అక్టోబర్ 29 న బేగంపేట్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరపగా.. పశ్చిమ్ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్ కు తీసుకొచ్చి వారికి అధిక మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించినట్లు గుర్తించారు. ఆ అండాలను ఐవీఎఫ్ కేంద్రాలకు వచ్చే సంతానం లేని దంపతులకు అక్రమంగా భారీ ధరలకు విక్రయించి డబ్బులు దండుకున్నట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+