ఆసియాలో మూడో స్థానం మనదే.. మోదీకి రెండో ర్యాంక్!

అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన సత్తాను మరోసారి చాటుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2026' నివేదికలో భారత్ ఆసియాలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. బలమైన ఆర్థిక అంచనాలు, దౌత్యపరమైన ప్రభావం, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆసియా ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల జాబితాలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తర్వాత ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలవడం విశేషం.

ఒక్క భేటీతో ఆ దేశానికి జాక్‌పాట్.. భారత ప్రధాని మోదీ ఇచ్చిన వరాలేంటి?
ఒక్క భేటీతో ఆ దేశానికి జాక్‌పాట్.. భారత ప్రధాని మోదీ ఇచ్చిన వరాలేంటి?

2018లో ఆసియా పవర్ ఇండెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి చైనాతో ఉన్న శక్తి అంతరాన్ని భారత్ ఇప్పుడు అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించుకుంది. అయితే భారత్ కంటే చైనా శక్తి ఇప్పటికీ 80 శాతం ఎక్కువగానే ఉందని నివేదిక పేర్కొంది. లోవీ ఇన్‌స్టిట్యూట్ మొత్తం 8 ప్రమాణాల ఆధారంగా 27 దేశాలను విశ్లేషించగా.. భారత్ 5 విభాగాల్లో వృద్ధిని సాధించింది. దౌత్యపరమైన ప్రభావంలో భారత్ అత్యంత స్థిరంగా ఉంది. ఆగ్నేయాసియా దేశాలతో రక్షణ ఒప్పందాలు, బ్రహ్మోస్ క్షిపణి విక్రయాల వల్ల రక్షణ నెట్వర్క్ విభాగంలో భారత్ 9వ స్థానానికి ఎగబాకింది.

Asia Power Index 2026 India Ranks 3rd Biggest Power PM Narendra Modi 2nd Most Effective Leader Details

సాంస్కృతిక వ్యాప్తి, సమాచార ప్రవాహం, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలతో భారత సాంస్కృతిక ప్రభావం 43.8 పాయింట్లకు చేరుకుంది. లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రాజెక్ట్ లీడ్ డాక్టర్ హంటర్ మార్స్టన్ మాట్లాడుతూ.. భారత్ మొత్తం 40.5 స్కోరుతో ఓ ప్రధాన శక్తిగా ఎదిగిందని, ఆర్థిక సామర్థ్యంలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ మోదీ రెండో అత్యంత ప్రభావవంతమైన నేతగా నిలిచారని పేర్కొన్నారు.

పట్టాలెక్కిన సరయూ ఎక్స్‌ప్రెస్: భారత్ లోని ఈ స్టేషన్ నుంచి నేరుగా నేపాల్ కు
పట్టాలెక్కిన సరయూ ఎక్స్‌ప్రెస్: భారత్ లోని ఈ స్టేషన్ నుంచి నేరుగా నేపాల్ కు

నివేదిక ఎత్తిచూపిన కొన్నిసవాళ్లు
భారత్‌కు సానుకూల అంశాలతో పాటు కొన్ని సవాళ్లను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక వ్యవస్థలను కొలిచే విధానంలో మార్పులు, విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 20 బిలియన్ డాలర్ల తగ్గుదల వంటివి ప్రతికూల అంశాలుగా పేర్కొంది. గల్ఫ్ సంక్షోభ సమయంలో భారత్ దౌత్యపరమైన జోక్యం తక్కువగా ఉండటం వల్ల ప్రధాని మోదీ వ్యూహాత్మక ఆకాంక్షలపై అంచనాలు కొంత తగ్గినట్లు తెలిపింది. అయినప్పటికీ ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌కు ఉన్న అవకాశాల పరిధి చాలా పెద్దదని ఈ నివేదిక స్పష్టం చేసింది.

అమెరికాకు అత్యంత చేరువగా చైనా సైనికి శక్తి
ఇదే నివేదికలో అమెరికా, చైనా మధ్య పోటీపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య వ్యవహారాల్లో ఎక్కువగా నిమగ్నం కావడంతో ఆసియాపై అమెరికా దృష్టి తగ్గింది. దీనిని ఆసరాగా చేసుకుని చైనా తన సైనిక, ఆర్థిక శక్తిని పెంచుకుంటూ అమెరికాకు అత్యంత చేరువలోకి వచ్చింది. ప్రస్తుతం అమెరికా(78.9), చైనా(73.6) మధ్య శక్తి అంతరం కేవలం 5.3 పాయింట్లు మాత్రమే ఉందని లోవీ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+