చిత్తూరు లోక్ సభ ఎన్నికల వివాదం-31 వేల ఓట్ల తేడాపై ఈసీ క్లారిటీ..!

2024లో జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటికే ఎన్నో వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా పోలింగ్ శాతాలు అనూహ్యంగా పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం వీటి ద్వారా ఎవరికో లబ్ది జరిగిందన్న అనుమానాలను రేకెత్తించింది. దీనిపై ఇప్పటికే సామాజిక వేత్త పరకాల ప్రభాకర్ వంటి వారు పలుమార్లు గణాంకాల ద్వారా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా రిపోర్టర్స్ కలెక్టివ్ అనే న్యూస్ వెబ్ సైట్ చిత్తూరు లోక్ సభ స్ధానంలో (Chittoor Election) పోలింగ్ శాతాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై ప్రచురించిన ఓ కథనం కలకలం రేపుతోంది.

బెంగాల్ పేరు మార్చేస్తున్న సువేందు అధికారి- రాష్ట్రం కొత్త పేరు ఇదే..!
బెంగాల్ పేరు మార్చేస్తున్న సువేందు అధికారి- రాష్ట్రం కొత్త పేరు ఇదే..!

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు చిత్తూరు లోక్ సభ స్ధానం పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల అధికారులు ముందు ఇచ్చిన పోలింగ్ లెక్కలకూ, ఆ తర్వాత ఇచ్చిన పోలింగ్ లెక్కలకూ మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ తెలిపింది. ఈసీ అంతర్గత వివరాల ప్రకారం సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న 56,067 మంది ఓటేసినట్లు ఈసీ తొలుత పేర్కొంది. అయితే ఆర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ తర్వాత ఉదయానికి అక్కడ కేవలం 24,596 ఓట్లు మాత్రమే పోలయినట్లు ఈసీ తెలిపింది. దీంతో అప్పటివరకూ క్యూలో ఉన్న వారంతా ఓటువేయలేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇలా ఏకంగా 31 వేలకు పైగా ఓట్లు ఏమైపోయాయని రిపోర్టర్స్ కలెక్టివ్ ప్రశ్నించింది.

Chittoor Election Row AP CEO Responds to 31 471 Voter Discrepancy Cites RO Report
WhatsApp: వాట్సాప్ వెబ్ వాడే ఉద్యోగులకు కేంద్రం హెచ్చరికలు..! 7 సూచనలు..!
WhatsApp: వాట్సాప్ వెబ్ వాడే ఉద్యోగులకు కేంద్రం హెచ్చరికలు..! 7 సూచనలు..!

దీనిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఎక్స్ లో స్పందిస్తూ వివరణ ఇచ్చారు. అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ (RO) 04.06.2024న భారత ఎన్నికల సంఘానికి (ECI) సమర్పించిన 'రిపోర్ట్-31' ప్రకారం, పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి స్లిప్పులు పంపిణీ చేసిన ఓటర్ల సంఖ్య 56,067గా నమోదైందని నిర్దారించారని తెలిపారు. తద్వారా పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉండి, తాము ఓటర్ స్లిప్పులు ఇచ్చిన వారి సంఖ్య 56, 067 అని నిర్ధారించారు. మరి ఉదయానికి అదనంగా పోలైన ఓట్లు 24,596 మాత్రమే అని ఎందుకు చెప్పారన్న అంశాన్ని వారు వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+