జనగామ మెడికల్ కాలేజ్, క్రిటికల్ కేర్ బ్లాక్ త్వరలో ప్రారంభం.. మిగతా పనులపురోగతి ఇలా!

తెలంగాణా రాష్ట్రంలో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణంపై తెలంగాణా సర్కార్ ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగా జనగాం మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్స్‌, సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హుస్నాబాద్ ఏరియా హాస్పిటల్ నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ మేరకు ఆయా భవనాల నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష చేశారు. సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు తో పాటు ఆరోగ్యశాఖల ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.జనగాం మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, సుమారు రూ.154 కోట్లు వెచ్చించి అత్యాధునిక వసతులతో ఈ భవనాలను ప్రభుత్వం నిర్మించిందని అధికారులు మంత్రికి వివరించారు.

telangana health news Jangaon Medical College and Critical Care Block to open soon here remaining works status

కాలేజీ, సీసీబీ భవనాల ప్రారంభోత్సవానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల చివరికల్లా గర్ల్స్‌ హాస్టల్, డిసెంబర్ చివరికల్లా బాయ్స్‌ హాస్టల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి చివరి నాటికి మెడికల్ కాలేజీ భవనాన్ని సైతం విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.

సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్ నిర్మాణ పనులను స్పీడప్ చేసి, మార్చి చివరి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్‌ తదితర సంస్థలకు మాజీ మంత్రి, దివంగత అనంతుల మదన్‌ మోహన్‌ గారి పేరు పెడుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే ఆయా సంస్థల నేమ్ బోర్డులు మార్చాలని, ప్రభుత్వ రికార్డులు, వెబ్‌సైట్లలోనూ పేరును అప్‌డేట్ చేయాలని జిల్లా కలెక్టర్‌‌కు, ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రద్దీ రహదారులపై 'కంజెషన్ ఛార్జీలు', పైలెట్ ప్రాజెక్ట్ అక్కడే!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రద్దీ రహదారులపై 'కంజెషన్ ఛార్జీలు', పైలెట్ ప్రాజెక్ట్ అక్కడే!

హుస్నాబాద్‌ ఏరియా హాస్పిటల్‌ను వంద బెడ్ల నుంచి 250 బెడ్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, రూ.82 కోట్లతో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులను వేగంగా పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. హుస్నాబాద్‌లో మెడికల్ పీజీ కాలేజీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు. తమ పరిధిలోని మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, హాస్టళ్ల నిర్మాణ పనులు, ఇతర అంశాలపై రెగ్యులర్ సమీక్షలు జరపాలని, ప్రతి వారం తనకు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+