WhatsApp: వాట్సాప్ వెబ్ వాడే ఉద్యోగులకు కేంద్రం హెచ్చరికలు..! 7 సూచనలు..!

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వాడకం విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోంశాఖ ఇవాళ ఓ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులు వాట్సాప్ ను ఇలా వాడుతున్నట్లయితే, వెంటనే మార్చుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను అలర్ట్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఓ అడ్వైజరీ జారీ చేసింది. దీన్ని ఉద్యోగులంతా తప్పనిసరిగా పాటించాలని హోంశాఖ కోరుతోంది.

Central Government Employees:
Central Government Employees:

కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగంపై కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇందులో వాట్సాప్ వెబ్ లో లాగిన్ అయిన అకౌంట్ ను ఇతరులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ అనలిటికల్స్ యూనిట్ హెచ్చరించింది. వాట్సాప్ వెబ్ సెషన్ యాక్టివ్ గా ఉనప్పుడు దుండగులు అధికారికంగా యూజర్ల అకౌంట్లలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తద్వారా వ్యక్తిగత ఛాట్స్ ను చదవడం, వారి పేరుతో ఇతరులకు వాటిని ఫార్వార్డ్ చేయడం, కాంటాక్టులు, గ్రూప్ ఛాట్స్ ను యాక్సెస్ చేయడం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

WhatsApp Web Warning MHA Advises Government Employees Against Sharing Sensitive Official Chats
PF Withdrawal: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా- ముహుర్తం ఫిక్స్..!
PF Withdrawal: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా- ముహుర్తం ఫిక్స్..!

అంతే కాకుండా యూజర్ల నమ్మకమైన ఐడెంటిటీని వాడుకుని ఆర్దిక మోసాలు, ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ వంటి సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆఫీసు కంప్యూటర్లు, ఇతరులు వాడే కంప్యూటర్లు, పబ్లిక్ కంప్యూటర్లలోవాట్సాప్ వెబ్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. వాట్సాప్ వెబ్ వాడే వారు అధికారిక, సున్నిత సమాచారం షేర్ చేయొద్దని కోరుతోంది. అలాగే అవసరం లేనప్పుడు వాట్సాప్ వెబ్ సెషన్ ను యాక్టివ్ గా ఉంచొద్దని, ముఖ్యంగా ఆఫీసు, ఇతరులు వాడే కంప్యూటర్లలో లాగాఫ్ కాకుండా వదిలేయొద్దని సూచిస్తోంది. అలాగే ప్రతీ సెషన్ తర్వాత తప్పనిసరిగా లాగ్ అవుట్ చేయాలని కోరుతోంది. కేవలం బ్రౌజర్ విండో క్లోజ్ చేస్తే లాగ్ అవుట్ చేసినట్లు కాదని స్పష్టం చేసింది.

అలాగే తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఇన్ కాగ్నిటో లేదా ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్ వాడాలని సూచిస్తోంది. నమ్మకమైన కంప్యూటర్లలోనే దీన్ని వాడాలని సూచిస్తోంది. అలాగే సైబర్ కేప్ లు, పబ్లిక్ కియోస్క్ లు, హోటల్స్, ఇతరులు వాడే కంప్యూటర్లు లేదా నమ్మకం లేని సిస్టమ్స్ లో వాట్సాప్ వెబ్ వాడొద్దని కోరుతోంది. అలాగే మీ అకౌంట్ నుంచి పంపని మెసేజ్ లు ఇతరులకు వెళ్లడం లేదా మీ కాంటాక్టుల నుంచి అనుమానాస్పద రిప్లైలు రావడం కనిపిస్తే తీవ్రంగా పరిగణించాలని కోరుతోంది. చివరిగా మీ పీసీ సాఫ్ట్ వేర్ ను, బ్రౌజర్ ను, సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సూచిస్తోంది.అనుమానాస్పదంగా కనిపించే డౌన్ లోడ్ లు, తెలియని ఫైల్స్, క్రాక్డ్ సాఫ్ట్ వేర్ , నమ్మకం లేని సాఫ్ట్ వేర్ లకు దూరంగా ఉండాలని కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+