నెగిటివ్ టాక్ తోనూ దుమ్ములేపే కలెక్షన్స్.. నీ సినిమాకే సాధ్యం అన్నా..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది 'కుబేర' సినిమాతో అలరించిన ఆయన ఈ ఏడాది 'ఓం' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ పతాకాలపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జాగ్ మగ్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దు అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ ఓం మూవీ స్టోరీ సాగుతుంది.
ఈ చిత్రంలో శ్రీలీల, సాయి పల్లవి, ముమ్ముట్టి అలాగే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, నటి రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందే సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక కొన్ని చోట్ల ఓం మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. సెకండాఫ్ తేలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఓం మూవీకి మూడోరోజు కూడా అద్దిరిపోయే వసూల్లు వచ్చినట్లు సమాచారం. ఇండియాలో రూ. 18 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు.. అలాగే రూ. 15 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ను సాధించినట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఈ మూవీకి ఓవర్సీస్ లో రూ. 5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా ఓం మూవీకి మూడు రోజుల్లో ఇండియాలో గ్రాస్ రూ. 58 కోట్లతో పాటు రూ. 50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

అటు ఓవర్సీస్ లోనూ ఓం మూవీ ఇప్పటివరకూ రూ. 27 కోట్లకుపైగా వసూల్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఓం మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 85 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించినట్లు సమాచారం. మరోవైపు ధనుష్ నటించిన తేరే ఇష్క్ మెయిన్, రాయన్, కుబేర, సార్ లాంటి చిత్రాలు రూ. 100 కోట్ల మార్కును దాటేశాయి. ఈ మూవీ కూడా త్వరలోనే ఆ జాబితాలో చేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
