ఇక వీరందరి రేషన్ కార్డులు కట్ - ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
రేషన్ కార్డుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలు రేషన్ కార్డు ఆధారంగా పలు సబ్సిడీలు.. పథకాలు అందిస్తున్నాయి. అన్నింటికీ రేషన్ కార్డు ప్రాతి పదికగా తీసుకుంటున్నారు. దీంతో, అనర్హులు సైతం రేషన్ కార్డులు పొందినట్లు తేల్చారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరిశీలనలో పలు ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో, వీరి రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేషన్ కార్డుల అంశంలో కేంద్రం సంచలన నిర్ణయానికి సిద్దమైంది. దేశ వ్యాప్తంగా అనర్హులను గుర్తించేందుకు చేసిన పరిశీలనలో కీలక అంశాలు గుర్తించారు. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 51,303 లబ్ధిదారుల కుటుంబాలపై కేంద్రం సమగ్ర సర్వే నిర్వహించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతా కుటుంబాల్లో 15.7 శాతం మంది అనర్హులు ఉన్నట్లు బయట పడింది.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (పీఎంజీకేఏవై) లో భారీగా అనర్హులు ఉన్న ట్లు కేంద్రం గుర్తించింది. కారు, ఏసీ, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు క్షేత్ర స్థాయి అధ్యయనంలో తేలింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 39.5 శాతం అనర్హులు, త్రిపురలో 39.2 శాతం, తమిళనాడులో 38.7 శాతం, మేఘాలయలో 28.5 శాతం మంది అనర్హులు ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు.

రాష్ట్రాల సహకారంతో తొలిగింపు
దీంతో.. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఉన్న రాష్ట్రాల్లో పరిశీలన మరింత లోతుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇదే సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఉచిత రేషన్ పంపిణీలో 13.2 శాతం మేర అనర్హులు ఉన్నట్లు తేల్చారు. ఇందులో జాతీయ సగటు 13.2 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతా కుటుంబాల్లో అనర్హులు 15.7 శాతం వరకు ఉన్నట్లు కనుగొన్నారు. సంపన్న వర్గాలు కూడా రేషన్ కార్డులను కలిగి ఉండటం వల్ల ఖజానాపై రూ.వేల కోట్ల భారం పడటంతో పాటు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయటంతో పాటుగా ఈ కేవైసీ ప్రక్రియ తప్పని సరి చేయాలని డిసైడ్ అయ్యారు. రానున్న రెండు నెలల కాలంలో పూర్తి స్థాయిలో అనర్హుల రేషన్ కార్డులను తీసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
