TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
తిరుమలలో ఓ మోస్తారుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. సహజంగా కార్తీక మాసం లో శ్రీవారి సన్నిధికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ గత వారం రోజుల నుంచి భక్తుల రద్దీ అంతగా లేదు. కాగా, వచ్చే నెలలో వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దర్శనాల తో పాటుగా టోకెన్ల జారీ పైన నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ 10 రోజుల్లో మొత్తం 8.34 లక్షల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు 92 శాతం ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నా మని వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఆన్లైన్లో ఎస్ఎస్డీ (SSD) టోకెన్లు విడుదల చేయనున్నారు. తొలి 2 రోజులు సర్వదర్శనం ఉండదని.. ఆ తర్వాతి 8 రోజుల పాటు భక్తులకు సర్వదర్శనం అమలు చేస్తామని తెలిపారు. మొదటి 3 రోజులు (డిసెంబర్ 20, 21, 22) ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనం కోసం టోకెన్లు కేటాయిస్తారు.

పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం.. టోకెన్లు
ఇందు కోసం రిజిస్ట్రేషన్ గడువు ను నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కేటాయించారు. ఇక, డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డిప్ డ్రా తీసి టోకెన్లు మంజూరు ప్రకటించారు. గరిష్టంగా ఒక దరఖాస్తుకు 4 మంది యాత్రికులు (1+3 కుటుంబ కోటా) గా నిర్ణయించారు. కాగా.. మొదటి మూడు రోజులు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి, మరియు ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసారు. కాగా, మిగిలిన 7 రోజులు డిసెంబర్ 23 నుండి 29 వరకు ఆన్లైన్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. శ్రీవాణి దర్శనం కోటా టికెట్లు డిసెంబర్ 5, ఉదయం 10:00 గంటలకు గంటల కు విడుదల చేస్తారు. రోజుకు వెయ్యి చొప్పున వీటిని కేటాయించారు. ఇక.. రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా డిసెంబర్ 5, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. రోజుకు 15,000 టిక్కెట్లు జారీ చేయనున్నారు. అయితే.. సర్వ దర్శనం కోసం డిసెంబర్ 23 నుండి 29 వరకు ఎలాంటి ముందస్తు టోకెన్లు లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా భక్తులకు ప్రవేశం లభించనుంది.













Click it and Unblock the Notifications
