కూటమి డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్లు ఖరారు: టీడీపీ - జనసేన నుంచి వీరే...!!
ఏపీలో కార్పోరేషన్లు- మున్సిపాల్టీల కొత్త పాలక వర్గాలు ఈ రోజు కొలువు తీరుతున్నాయి. డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్పర్సన్ల పంపకాల పైన మూడు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. అందులో భాగంగా పార్టీలకు కేటయించిన స్థానాలకు అనుగుణంగా మూడు పార్టీలు తమ అభ్యర్దులను ప్రకటించాయి. ఈ రోజు వీరంతా అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, పంచాయితీల్లోనూ పోరు ఆసక్తి కరంగా మారుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించిది. అనంతపురం మినహా ఎన్నికలు జరిగిన మిగిలిన కార్పోరేషన్లు సొంతం చేసుకుంది. ఈ నెల 26న నాలుగు కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. కొత్త మున్సిపల్ పాలకవర్గాలు నేడు ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్దం అయింది. అందులో భాగంగా డిప్యూటీ మేయర్లు.. వైస్ ఛైర్మన్ల విషయంలో కూటమి పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. తెలుగుదేశానికి 66, జనసేనకు 23, బీజేపీకి 9 కేటాయించారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థుల్ని టీడీపీ, జనసేన ప్రకటించాయి. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ సతీమణి క్రాంతిశ్రీని విజయవాడ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఏలూరు-పృథ్వీ శారద, కడప-మన్సూర్ అలీఖాన్, అనంతపురం-టి.స్వాతి, చిత్తూరు-ఎ.గోపీనాథ్, ఒంగోలు-చావలి చర్పిత పేర్లను టీడీపీ నాయకత్వం ప్రకటించింది.

నేటి నుంచి కొత్త పాలక వర్గాలు
కాగా, జనసేనకు 4 కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ పదవులతో పాటు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్ ఛైర్పర్సన్ పదవులు కేటాయించారు. తెలుగుదేశం మేయర్ పదవులు దక్కించుకున్న మచిలీపట్నం, తిరుపతి, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవుల్ని జనసేనకు ఇచ్చారు. ఇక..జనసేనకు దక్కిన కార్పోరేషన్లలో డిప్యూటీ మేయర్ అభ్యర్ధులను ఖరారు చేసారు. వారి పేర్లను ప్రకటించారు. మచిలీపట్నం-కొట్టే వెంకటరావు, విశాఖపట్నం-పందిరి వెంకట శివప్రసాద్, తిరుపతి- పాలడుగు విజయ, గుంటూరు-యర్రంశెట్టి రాజేశ్ కు అవకాశం కల్పించారు. కూటమి సీట్ల ఖరారులో భాగంగా బీజేపీకి కర్నూలు, నెల్లూరు
డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి.












Click it and Unblock the Notifications
