ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, ఇద్దరికి సీరియస్..

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జంబునాథపురం, తురయూర్- ముసిరి రోడ్డు వద్ద జరిగింది. ఘటనా సమయంలో వ్యానులో పది మంది కార్మికులు ఉన్నారు. వీరంతా తిరుకట్టుపల్లిలోని ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నట్లు సమాచారం. నమక్కల్ జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇక ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందించారు. అయితే ప్రమాద సమయంలోనే ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ప్రయాణికులు ముసిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TamilNadu Horrific road accident in Tamil Nadu 8 dead two in critical condition Tamil Nadu news

మరోవైపు మృతదేహాలను తిరుచ్చిలోని మహాత్మాగాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇక ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ రోడ్డు ప్రమాద ఘటనపై ప్రస్తుతం జంబునాథపురం పోలీసులు విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+