వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యువ హీరో.. మరో క్రేజీ డైరెక్టర్ తో..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల చెన్నై లవ్ స్టోరీ, కే- ర్యాంప్ లాంటి సినిమాలతో అలరించాడు. ఇక రాజావారు రాణిగారు (2019) చిత్రంతో కిరణ్ అబ్బవరం అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, క తదితర సినిమాలతో అలరిస్తూ వచ్చాడు.
సినిమా హిట్.. ప్లాఫ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రియాలిటీ అనే సినిమా చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా డిసెంబర్ 25 న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన దేవికా భట్ మీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో శరత్ కుమార్, సాయి కుమార్, రోహిని, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ జోయ్ ఫిల్స్మ్ బ్యానర్ లో సుధాకర్ చాగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ యెర్ర కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు పుష్ప, పుష్ప 2 సినిమాలకు సహాయ రచయితగా పనిచేసిన వీరు కోగటం దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు రికార్డ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
