ఈ వారం రాశిఫలాలు: ఫిబ్రవరి 22 శుక్రవారం నుండి 28 గురువారం 2019 వరకు
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేష రాశి
ఈ వారం అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం ఉంటుంది. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం ఉంటుంది.ఖర్చులు పెట్టుబడులు అధికంగా ఉంటాయి. పోటీల్లో గెలుపుకై ప్రయత్నం అధికం అవుతుంది.పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రారంభంలో భాగస్వామ్యాలకు అనుకూలం ఉంటుంది.ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది.విష్ణు సహస్ర నామలు చదవడం,లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది.

వృషభ రాశి
ఈ వారం సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. అనుకోని సమస్యలు ఉంటాయి. నూతన పరిచయాలు అనుకూలం అవుతాయి.సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకత తగ్గుతుంది. వ్యతిరేకతలు అధికంగా ఉంటాయి.అన్ని పనుల్లోనూ పోటీలు ఎదుర్కొటాంరు. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం ఉంటుంది.అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం.పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి,పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథున రాశి
ఈ వారం పెద్దలతో వ్యతిరేకతలు పనికిరావు. శ్రమానంతరం విజయం లభిస్తుంది.అధికారిక వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి.సౌకర్యాలపై దృష్టి ఉంటుంది.ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుస్తారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది.ఆందోళన తగ్గుతుంది. ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం.తొందరపాటు పనికిరాదు. విష్ణు సహస్ర నామలు చదవడం,లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది.

కర్కాటక రాశి
ఈ వారం అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నూతన ప్రణాళికలపై దృష్టి ఉంటుంది. వ్రమతో కార్య సాధన ఉంటుంది. శత్రువులపై విజయం తప్పదు.మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆహార విహరాలకు అనుకూలం ఏర్పడుతుంది.సౌకర్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాదుల విషయంలో కొత్త ఆలోచనలు తప్పవు.నాగదేవత పూజ మేలు చేస్తుంది.నాగదేవత పూజ మేలు చేస్తుంది.

సింహరాశి
ఈ వారం ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆలస్య నిర్ణయాలు ఉంటాయి.వారాంతరలో అభీష్టసిద్ధి ఉంటుంది. పోటీల్లో గుర్తింపు లభిస్తుంది.మానసిక ఒత్తిడి ఉంటుంది.మాట విలువ తగ్గుతుంది.ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. వారం ప్రారంభంలో సంప్రదింపులకు అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.సోదరవర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. నవగ్రహ ప్రదక్షిణ వల్ల అనుకూలం.

కన్యారాశి
ఈ వారం పెద్దలతో అనుబంధాలు విస్తరిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అవసరం. లాభాలు సంతోషాన్నిస్తాయి.కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది.అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.అనుకున్న పనులు పూర్తి చేస్తాయి. శ్రమతో కార్యాల నిర్వహణ చేస్తారు.శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

తులా రాశి:
ఈ వారం ఆత్మ విశ్వాసం పెంచుకుటాంరు. కొత్త పనులకు రూపకల్పన చేస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్విస్తరిస్తాయి. పోటీల్లో గుర్తింపు లభిస్తుంది.విశ్రాంతికై ప్రయత్నం ఉంటుంది. నిత్యావసర ఖర్చులు చేస్తారు. ప్రారంభంలో నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి.ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నిరంతరం మనస్సులో భగవన్నామ స్మరణతో ఉండండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి
ఈ వారం కుటుంబ అనుబంధాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుటాంయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి.విజయం సాధిస్తారు.పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు.లాభాలు సద్వినియోగం అవుతాయి. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి.ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. ఆహార విహారాదులుంటాయి.విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు.మాట విలువ తగ్గుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

ధనుస్సురాశి
ఈ వారం నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. వ్యవహార దక్షత పెరుగుతుంది. ధార్మికమైన ఖర్చులు తప్పకపోవచ్చు.వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలంగా మెలగాలి. లాభాలు సంతోషాన్నిస్తాయి.పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. వారాంతరలో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం.సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రజపం చేసుకోవడం మంచిది.

మకరరాశి
ఈ వారం సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. పదోన్నతిపై దృష్టి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రమంగా ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అధికారిక వ్యవహారాలుంటాయి.అనారోగ్య భావాలు పెరుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి
ఈ వారం కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. లాభాలు సంతోషానిస్తాయి.వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, గౌరవం ఉన్నా శ్రమ తప్పదు. ఒత్తిడులను అధిగమించాలి. వారాంతంలో ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది.ఊహించని ఇబ్బందులు ఉంటాయి.అనుకోని ఖర్చులు ఉంటాయి.ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెరుగుతాయి. లక్ష్యాలను సాధిస్తారు.నిరంతరం మనస్సులో భగవన్నామ స్మరణతో ఉండండి శుభం కలుగుతుంది.

మీన రాశి
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లో జాగ్రత్త ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. కొత్త పనులు వాయిదా వేయడం మంచిది. అనుకోని సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలపై దృష్టి పెరుగుతుంది. అగౌరవ సూచనలున్నాయి జాగ్రత్తలు వహించండి.సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాలు విస్తరిస్తాయి.పెట్టుబడులు అనుకూలిస్తాయి.సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రజపం చేసుకోవడం మంచిది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!