ఏప్రిల్ లో కుజ బుధుల సంయోగంతో వ్యూహాత్మక శక్తి యోగం.. వీరికి కుబేర కటాక్షం!
వేద జ్యోతిషశాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాల సంచారం జరుగుతుంది. వివిధ గ్రహాలు అనేక రాశులలో సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాకుమారుడు, వ్యాపార ప్రదాత అయిన బుధుడు ఏప్రిల్ మాసంలో మీన రాశిలో కుజుడు తో సంయోగం చెంది శుభ యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
బుధ కుజుల కలయికతో వ్యూహాత్మక శక్తి యోగం
ఏప్రిల్ 2వ తేదీన కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన బుధుడు మీన రాశిలోకి వెళ్లి కుజుడు తో సంయోగం చెంది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తున్నారు. అయితే బుధ కుజుల సంయోగాన్ని వ్యూహాత్మక శక్తి యోగంగా కొందరు చెబుతారు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభాలు చేకూరుతాయి ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
బుధ కుజ సంయోగంతో వృషభ రాశి జాతకులకు మేలు జరుగుతుంది. కెరీర్ లోను, ఆర్థిక విషయాలలోనూ వీరు సానుకూల ఫలితాలను చూస్తారు. బుధుడు కుజుల సంయోగం వృషభ రాశిలో 11వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల ఈ సమయంలో ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు లేదా కొత్త వ్యాపార అవకాశాలను కనుగొనే అవకాశం ఉంది. ఈ సమయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మిధున రాశి
బుధ కుజ సంయోగంతో మిధునరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. మిధునరాశికి బుధుడు అధిపతి కాబట్టి ఈ సంయోగం ఈ రాశిలో జన్మించిన వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రాశి నుండి పదవ ఇంట్లో బుధుడు మరియు కుజుడు కలయిక ఏర్పరిచి సానుకూలతలను కలుగజేస్తారు. కెరీర్ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో నూతన ప్రాజెక్టులలో పని చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు బుధ కుజ సంయోగం కలిసివస్తుంది. ఈ కలయిక ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో జరుగుతుంది. మీరు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి లేదా కొత్త బాధ్యతలు లాభించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రాజెక్టులను లేదా కొత్త ప్రణాళికలను ప్రారంభించడం భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications