డీలిమిటేషన్ బిల్లు పై కాంగ్రెస్ సంచలన నిర్ణయం, కీలక మలుపు..!!

డీలిమిటేషన్ బిల్లు పై ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డీఎంకే తో పాటుగా ఎన్సీపీ సైతం డీలిమిటేషన్ కు మద్దతు ప్రకటించాయి. బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజార్టీని ఎన్డీఏ కూడగట్టింది. సోమవారం పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రతిపాదనకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో భేటీ అయిన ఇండియా కూటమి బిల్లు పైన సమీక్ష చేసింది. ఆ తరువాత తమ డిమాండ్లను ప్రస్తావిస్తూనే కీలక ప్రకటన చేసింది.

డీలిమిటేషన్ అంశంపై ఇండియా కూటమి చర్చించింది. మిత్రపక్షాలు బిల్లుకు మద్దతు ఇవ్వటం పైనా కీలకంగా చర్చించారు. ఇప్పటికే డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఎన్సీపీ సైతం బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటంతో ఈ బిల్లు పాస్ అవుతుందనే ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇండియా కూటమి సమావేశానికి 12 పార్టీల నేతలతో పాటు ఒక స్వతంత్ర ఎంపీ హాజరయ్యారు.

 విజయ్ కోసం కాంగ్రెస్ నిర్ణయమే మోదీకి వరంగా - డీలిమిటేషన్, 2029 కు లైన్ క్లియర్..!!
విజయ్ కోసం కాంగ్రెస్ నిర్ణయమే మోదీకి వరంగా - డీలిమిటేషన్, 2029 కు లైన్ క్లియర్..!!
INDIA Alliance Proposes Three Key Demands to Centre Over Delimitation Bill after meeting with supporting parties

ఈ బిల్లు దేశ భవిష్యత్ కు ప్రమాదకరమని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసారు. తాము యధాతథంగా ఇదే బిల్లును ప్రవేశ పెడితే వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఈ బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. లోక్ సభ ప్రస్తుత స్థానాల సంఖ్య పెంచవద్దని.. రాష్ట్రాల వారీగా వాటాను మరో 25 ఏళ్లు పొడిగించాలని డిమాండ్ చేసారు.

బీజేపీ ఇప్పుడు టీఎంసీ వంటి పార్టీలను చీల్చి బిల్లు ఆమోదం కోసం ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. అదే విధంగా ఈ డీలిమిటేషన్ వెనుక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారని చెప్పారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్ల ను కూటమి నేతలు ప్రతిపాదించారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను పెంచకూ డదు, మహిళా రిజర్వేషన్లను ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలి, రాష్ట్రాల వారీగా లోక్‌సభ స్థానాల వాటాను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని మూడు ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు.

డీలిమిటేషన్ బిల్లు..నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఇలా - అక్కడే అసలు 'గేమ్'..!!
డీలిమిటేషన్ బిల్లు..నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఇలా - అక్కడే అసలు 'గేమ్'..!!

అదేవిధంగా, నియోజకవర్గాల పునర్విభజన తాజా జనాభా లెక్కల ఆధారంగా చేపట్టా లని కూటమి నేతలు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాల ను విస్మరించారని విమర్శించారు. సామాజిక న్యాయం, రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భంగం కలగ కుండా పునర్విభజన జరగాలని ఇండియా కూటమి తమ అభిప్రాయంగా తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+