విజయ్ కోసం కాంగ్రెస్ నిర్ణయమే మోదీకి వరంగా - డీలిమిటేషన్, 2029 కు లైన్ క్లియర్..!!
కాంగ్రెస్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మోదీకి వరంగా మారింది. తమిళనాడులో కాంగ్రెస్ నిర్ణయా లతో పాటుగా.. కూటమి భాగస్వామ్య పక్షాలతో బంధాల నిర్వహణలో వైఫల్యం ఇప్పుడు ఎన్డీఏకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ కూటమి పక్షాల డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో చేసిన మార్పులతో అటు వారిని తమ వైపు తిప్పుకోవటం.. ఇండి కూటమిని బలహీన పర్చటంలో మోదీ - షా ద్వయం రాజకీయం సక్సెస్ అయింది. అయితే, విజయ్ కోసం కాంగ్రెస్ నాటి నిర్ణయమే ఇప్పుడు మోదీకి 2029 లో తిరిగి అధికారం దక్కించుకోవానికి బ్రహ్మాస్త్రంగా మారుతోంది.
మోదీ ప్రభుత్వం అనుకున్నది చేస్తోంది. మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందటం లాంఛనంగా కనిపిస్తోంది. ఏప్రిల్ లో ఇదే బిల్లు మెజార్టీ లేక సభలో వీగిపోయింది. కాగా, సమయం వేచి చూసిన మోదీ- షా ద్వయం కాంగ్రెస్ కూటమిని దెబ్బ కొట్టి మరీ.. ఈ సారి బిల్లు ఆమోదానికి అంతా సెట్ చేసారు. ఈ బిల్లు ఆమోదం పొందటానికి ఇప్పుడు డీఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. తొలి నుంచి డీఎంకే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కు కూత వేటు దూరంగా ఆగిన సమయంలో డీఎంకే తో దశాబ్దాల బంధం తెంచుకొని కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీంతో, స్టాలిన్ దూరం అయ్యారు. డీఎంకే కు 22 మంది ఎంపీల మద్దతు ఉంది. తమ కూటమిలో కీలక స్థాయిలో ఉన్న డీఎంకే ను జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొంటున్న సమయంలో విజయ్ ప్రభుత్వం కోసం దూరం చేసుకోవటం కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పిదం గా ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి.

అక్కడే బీజేపీకి కలిసొచ్చింది
సరిగ్గా కాంగ్రెస్ చేసే తప్పుల కోసం వేచి చేస్తున్న మోదీ - షా ద్వయం దీనిని ఇప్పుడు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా.. డీఎంకే 22 మంది ఎంపీల మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం తెర వెనుక వ్యూహాలు సిద్దం చేసింది. డీఎంకే కోరినట్లుగా తమిళనాడు సహా ఏ రాష్ట్రంలోనూ సీట్ల వాటా తగ్గకుండా 50 శాతం మేర పెంపుకు బిల్లులో ప్రతిపాదించారు. అదే విధంగా మరో డిమండ్ గా ఉన్న 25 ఏళ్ల పాటు సీట్ల సంఖ్య కొనసాగించేందుకు అంగీకరించారు. దీంతో.. డీఎంకే మద్దతుకు సిద్దమైంది. దీని ద్వారా అటు డీఎంకే ను గెలిపిస్తూ.. భవిష్యత్ లో తమ గెలుపుకు మోదీ టీం మార్గం సుగమం చేసుకుంది. అటు శరద్ పవార్ కాంగ్రెస్ తోనూ టచ్ లోకి వెళ్లింది. వారి మద్దతు ఖాయమైంది. దీంతో.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ తో పాటుగా లోక్ సభ సీట్లు ఏకంగా 50 శాతం మేర పెరగనున్నాయి. దీని ద్వారా మోదీ - షా ద్వయం అటు ఇండి కూటమి ఐక్యతను దెబ్బ తీయటంతో పాటుగా 2029 లో తిరిగి అధికారంలోకి రావటానికి తాజా డీలిమిటేషన్ ను బ్రహ్మాస్త్రంగా మార్చుకోవటంలో తొలి అడుగు లో సక్సెస్ అయ్యారు.












Click it and Unblock the Notifications
