ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు, జిల్లాల వారీ లిస్టు - కూటమి Vs వైసీపీ.. అడ్వాంటేజ్ అక్కడే..!?

పార్లమెంట్ - అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు దాదాపు ఖాయమైంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచుతోంది. లోక్ సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతానికి పెరగను న్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో నే బిల్లును తీసుకొచ్చేందుకు సిద్దమైంది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. నియోజక వర్గాల పునర్విభజన ద్వారా ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయనేది దాదాపు స్పష్టత వచ్చింది. అదే సమయంలో మహిళలకు కేటాయించే సీట్లు ఖరారయ్యాయి. ఎంపీ.. ఎమ్మెల్సీ సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. దీంతో, ఈ పెరిగే సీట్లు ఎవరికి కలిసి వస్తాయనేది కీలకంగా మారుతోంది.

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. అదే విధంగా ప్రస్తుతం ఉన్న 25 లోక్ సభ స్థానాలు 38కి చేరనున్నాయి. అయితే.. ఈ ప్రాతిపాదికన జిల్లాల వారీగా పెరిగే సీట్ల పైన ఒక అంచనా సిద్దం చేసారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఆరు జిల్లాల్లో అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. అదే విధంగా కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కు, చిత్తూరు లో 14 నుంచి 21, నెల్లూరులో పది నుంచి 15కు, ఇక.. ప్రకాశంలో 12 స్థానాలు 18కి పెరగనున్నాయి. దీంతో.. మొత్తం ఈ రీజియన్ లో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు 37 పెరగటం ద్వారా 111కి చేరనున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రీజియన్ లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు గెలవగా .. 2024 లో సీన్ రివర్స్ అయి కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఇక, గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 నుంచి 25కి చేరనున్నాయి. కృష్ణా లో పునర్వి భజన తరువాత సీట్లు 24కు పెరగనున్నాయి. దీంతో.. ఈ రెండు జిల్లాల్లో 49 స్థానాలు కానున్నాయి.

డీలిమిటేషన్ పై పై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం- ప్రతిపక్షాలు కోరినట్లుగానే, ఇక..!!
డీలిమిటేషన్ పై పై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం- ప్రతిపక్షాలు కోరినట్లుగానే, ఇక..!!
delimitation-district-wise-seat-increase-sparks-political-debate-over-who-benefits-here-the-report

ఏపీలో పునర్విభజన కలిసొచ్చేదెవరికి

అయితే... ఇక్కడ ప్రస్తుతం కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీకి పునర్విభజన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనేది కీలకంగా మారనుంది. ఇక, రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 34 స్థానాల 50కి చేరనున్నాయి. తూర్పు గోదావరి లో ప్రస్తుతం 19 ఉండగా 28కి పెరగనున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు 22కి చేరుతాయి. ఇక్కడ పవన్ తో సహా కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాల్లో సామాజిక సమీకరణాలు.. నియోజకవర్గాల పెంపు అధికారం డిసైడ్ చేయటంలో కీలకంగా మారనున్నాయి. ఇక, ఉత్తరాంధ్రలో విశాఖలో 15 నుంచి 23, విజయనగరం లో ప్రస్తుతం ఉన్న 9 స్థానాలు 15కు, శ్రీకాకుళంలోనూ 15 కు సీట్లు పెరగటం ద్వారా మొత్తంగా 34 స్థానాలు 53 కి చేరనున్నాయి. దీంతో.. అధికారంలోకి రావటానికి మేజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హెదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు అవకాశం ఉండనుంది. దీంతో.. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కూటమి వర్సస్ వైసీపీ మధ్య ఎవరికి ఏ మేర కలిసి వస్తుందనే అంచనాలు ఆసక్తిగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+