దక్షిణాది రాష్ట్రాలకు కొత్త చిక్కులు తప్పవా? డీలిమిటేషన్‌పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!

మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఇతర కేంద్ర మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 'సబ్ కా సాత్.. సబ్ కా వికాస్' నినాదంతో దేశాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ పై కేంద్రానికి బిగ్ బ్రేక్ త్రూ: బిల్లుకు ఇండియా బ్లాక్ నుంచి ఫస్ట్ సపోర్ట్
డీలిమిటేషన్ పై కేంద్రానికి బిగ్ బ్రేక్ త్రూ: బిల్లుకు ఇండియా బ్లాక్ నుంచి ఫస్ట్ సపోర్ట్

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఓ కీలక దశకు చేరుకుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశ జనాభాకు అనుగుణంగా లోక్‌సభ స్థానాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

AP CM Chandrababu Naidu on Delimitation Womens Quota Calls to Protect Southern States Representation

జనాభాకు అనుగుణంగా సీట్ల పెంపు అవసరం
1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని.. ఆ తర్వాత కూడా పాత జనాభా లెక్కల ప్రాతిపదికనే స్థానాల సంఖ్య కొనసాగిందని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో దేశ జనాభా 58.8 కోట్లు ఉండగా, లోక్‌సభలో 542 స్థానాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం దేశ జనాభా సుమారు 147 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో 543 స్థానాలతోనే కొనసాగడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ప్రతి 27 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సుమారు 50 శాతం సీట్లు పెరిగితే ఈ సంఖ్య 18 లక్షలకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ప్రజలకు మరింత మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు.

చైనా దేశంలో జనాభా 140 కోట్ల మంది ఉన్నారని,, 2100 సంవత్సరంలో భారత్‌లో చైనా జనాభాకు రెట్టింపు ఉంటుందని చెప్పారు. ఇండియాలో 1971లో ప్రతి 10 లక్షల మందికి ఓ ఎంపీ ప్రాతినిధ్యం వహించారని.. ప్రస్తుత జనాభా ప్రకారం 27 లక్షల మంది జనాభాకు ఓ ఎంపీ ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అమెరికా లాంటి దేశాల్లో 7.8 లక్షల మందికి ఓ ఎంపీ ఉన్నారన్నారు. జరిగే డీలిమిటేషన్ ప్రకారం 50 శాతం మేర సీట్లు పెరిగితే ప్రతి 18 లక్షల మంది జనాభాకు ఓ ఎంపీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందన్నారు.

డీలిమిటేషన్ తో ఏపీకి జరిగేది ఇదే..! కేబినెట్లో తేల్చేసిన చంద్రబాబు..!
డీలిమిటేషన్ తో ఏపీకి జరిగేది ఇదే..! కేబినెట్లో తేల్చేసిన చంద్రబాబు..!

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి
డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి జనాభా వృద్ధిని నియంత్రించాయని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రచార కార్యక్రమాల ద్వారా సంతానోత్పత్తి రేటును తగ్గించగలిగామని వివరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, జనాభా నియంత్రణతో పాటు జనాభా నిర్వహణకు ప్రోత్సాహకాలు అందించే విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే సీట్ల పెంపు చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తంగా మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పెంపు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియను రూపొందించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+