2బీహెచ్‌కే కాలనీలకు తీపికబురు.. రూ.53 కోట్లతో ఆ పనులకు ప్రభుత్వం పచ్చజెండా!

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 2బీహెచ్‌కే కాలనీలకు తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు కూడా పచ్చజెండా ఊపింది.

ఇందులో ఒక ముఖ్యమైన వెసులుబాటు కూడా కల్పించింది. సాధారణంగా కనెక్షన్ ఛార్జీలు వసూలైన తర్వాతే పనులు మొదలవుతాయి. కానీ ఈ సందర్భంలో ఆ ఛార్జీలు రాకముందే పనులు ప్రారంభించేందుకు అనుమతి లభించింది. సాధ్యమైన చోట్ల నీటి, డ్రైనేజీ కనెక్షన్లను ముందస్తుగానే విడుదల చేయవచ్చు. దీనివల్ల ఇళ్లు సిద్ధమైనా నీటి సదుపాయం లేక ఖాళీగా ఉండే పరిస్థితి తగ్గే అవకాశం ఉంది.

2BHK colonies Telangana Clears Water and Drainage Works for 2BHK Colonies in 17 Areas with Rs 53 12 Crore Estimate

ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 17 ప్రాంతాల్లోని కనెక్షన్లకు రూ.53.12 కోట్ల వ్యయం అంచనా వేశారు. నీటి సరఫరా నెట్‌వర్క్ అభివృద్ధికి రూ.17.73 కోట్లు, డ్రైనేజీ నెట్‌వర్క్ అభివృద్ధికి రూ.2.27 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు ఎండీ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో నంబర్ 1037 విడుదల చేసింది.

2బీహెచ్‌కే కాలనీల్లో మౌలిక సదుపాయాల విషయంలో గతంలో రోడ్లు, భవనాల శాఖ ఈ కాలనీల్లో నీటి సరఫరా, విద్యుద్దీకరణ, మురుగునీటి వ్యవస్థల కోసం రూ.196.46 కోట్లు మంజూరు చేసింది. ఆ ఇళ్లు నివాసయోగ్యంగా మారాలన్న ఉద్దేశంతో ఆ నిధులను మంజూరు చేసింది. అలా నిర్మాణం పూర్తయిన కాలనీల్లో కొన్నింటిని ఇప్పటికే సదుపాయాలతో అందిస్తున్నారు.

విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. మీ కోసం కొత్త స్కీమ్!
విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. మీ కోసం కొత్త స్కీమ్!

ఉదాహరణకు ఓల్డ్ మారేడ్‌పల్లి డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్, తాగునీటి సంప్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇళ్లు సిద్ధమైనా కనెక్షన్లు లేక లబ్ధిదారులు ఆ ఇళ్ళలోకి చేరలేకపోయిన ఉదంతాలు గతంలో వినిపించాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్న నిర్ణయం ఎంత వేగంగా అమలవుతుందన్నది చూడాల్సి ఉంది. పనులు సకాలంలో పూర్తయి కనెక్షన్లు అందితేనే ఈ కాలనీల్లో నివాసాలు నిండుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+