మాజీ మంత్రికి బిగ్ షాక్.. రూ.1020 కోట్ల కుంభకోణంలో అనుచరుడి అరెస్ట్!

తమిళనాడు మాజీ పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ సన్నిహితుడు కవి ప్రసాద్‌ను రూ.1,020 కోట్ల టెండర్ల అక్రమాల కేసులో అధికారులు అరెస్ట్ చేసారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు టెండర్లను ముందే ఖరారు చేశారని, కాంట్రాక్టు విలువలో 7.5 నుంచి 10 శాతం వరకు అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సమన్ల మేరకు గురువారం చెన్నైలోని విజిలెన్స్, అవినీతి నిరోధక డైరెక్టరేట్ అధికారుల ఎదుట కవి ప్రసాద్ హాజరు కాగా.. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.

సవాళ్లకే సవాళ్లు విసిరకుండా నేను ఉండలేను: ప్రధాని మోదీ
సవాళ్లకే సవాళ్లు విసిరకుండా నేను ఉండలేను: ప్రధాని మోదీ

కమీషన్ వసూళ్లు, మధ్యవర్తిగా ఆరోపణలు
చెన్నై, తిరుపూర్, కోయంబత్తూరులలో పురపాలక, నీటి సరఫరా శాఖ ద్వారా జారీ చేసిన పలు టెండర్లను ముందుగానే నిర్ణయించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని దర్యాప్తులో ఆరోపించారు. ఇందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టు మొత్తం విలువలో 7.5 నుంచి 10 శాతం దాకా అక్రమ చెల్లింపులు జరిగాయని.. ఆ సొమ్మును పార్టీ ఫండ్ పేరుతో సేకరించేవారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంలో కవి ప్రసాద్ మధ్యవర్తిగా పనిచేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఆయన్ ఫోన్‌లోని వాట్సాప్ సందేశాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య మీటింగ్స్ ఏర్పాటు చేయడం, ప్రాజెక్టుల సమాచారాన్ని ముందుగానే పంచడం, నిధుల సమీకరణలో సహకరించడం వంటివి చేశారని వెల్లడించింది.

Rs 1 020 Crore Tender Scam Former Tamil Nadu Minister KN Nehru Aide Kavi Prasad Arrested 12 Named in FIR

ఎయిర్పోర్టులో అడ్డగింత నుంచి ఎఫ్ఐఆర్ వరకు..
సెప్టెంబర్ 2026లో కవి ప్రసాద్ లండన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లుకౌట్ సర్క్యులర్ కారణంగా చెన్నై ఎయిర్పోర్టులో ఆయనను అడ్డుకున్నారు. అనంతరం దర్యాప్తు సంస్థకు అప్పగించగా.. విచారణ తర్వాత విడిచిపెట్టి దర్యాప్తు కొనసాగించారు. డిసెంబర్ 2025లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అందించిన 258 పేజీల పత్రాల ఆధారంగా దర్యాప్తు సంస్థ సెప్టెంబర్ 4, 2026న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

రేపు తిరప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రేపు తిరప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఎఫ్ఐఆర్‌లో మరో 12 మంది పేర్లు
ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో కవి ప్రసాద్‌తో పాటు మరో 12 మంది పేర్లను చేర్చారు. వారిలో కేఎన్ నెహ్రూ, ఆయన సోదరు కేఎన్ మణివణ్ణన్, ఎన్ రవిచంద్రన్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ సుదర్శనం, జేజే ఎబెనెజర్, టీవీహెచ్ గ్రూప్ ప్రతినిధులు, పురపాల, నీటి సరఫరా శాఖ అధికారుల పేర్లను చేర్చారు. వీరందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. రూ.1,020 కోట్ల మున్సిపల్ టెండర్ల అవకతవకల కేసులో కవి ప్రసాద్ అరెస్ట్ కీలక పరిణామంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+