22 ఫిబ్రవరి 2018 గురువారం దినఫలం

Posted By: Staff
Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా, యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం), పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

-------

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

Daily horoscope - Raasi Phalalu

మేషరాశి:-

ఈ రోజు స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయక ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి. కుటుంబీకులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో జయం చేకూరుతుంది.

Daily horoscope - Raasi Phalalu

వృషభరాశి:-

ఈ రోజు వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ సంస్థలలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. నూతన ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Daily horoscope - Raasi Phalalu

మిథునరాశి:-

ఈ రోజు సామూహిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు.

Daily horoscope - Raasi Phalalu

కర్కాటకరాశి:-

ఈ రోజు మీ ఆదాయానికి మించి ఖర్చు చేయటం వలన ఆందోళన పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. కొంతమంది సూటీపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి.

Daily horoscope - Raasi Phalalu

సింహరాశి:-

ఈ రోజు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం వుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు.

Daily horoscope - Raasi Phalalu

కన్యరాశి:-

ఈ రోజు ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. రాజకీయాల్లో వారికి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

Daily horoscope - Raasi Phalalu

తులరాశి:-

ఈ రోజు ముఖ్యులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.

Daily horoscope - Raasi Phalalu

వృశ్చికరాశి:-

ఈ రోజు స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరి, సోదరుల మధ్య కలహాలు తొలగిపోయి ఒక అవగాహనకు వస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వుంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.

Daily horoscope - Raasi Phalalu

ధనస్సురాశి:-

ఈ రోజు ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు.

Daily horoscope - Raasi Phalalu

మకరరాశి:-

ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి.

Daily horoscope - Raasi Phalalu

కుంభరాశి:-

ఈ రోజు ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలతో కలహాలు, అన్ని కార్యాలందు విఘ్నాలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు.

Daily horoscope - Raasi Phalalu

మీనరాశి:-

ఈ రోజు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. ఎవరికీ హామీలు ఉండటం మంచిది కాదని గమనించండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Daily horoscope for friday november 3– here’s what the stars have in store for you today

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి