ఏప్రిల్ 18న కుజుడి ఉదయంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులవుతారు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఏప్రిల్ 18వ తేదీన మీనరాశిలో ఉదయిస్తున్నాడు కుజుడిని శక్తికి, భూమికి, శౌర్య పరాక్రమాలకు, కోపానికి కారకుడుగా చెబుతారు.
కుజుడు ఉదయం కారణంగా లబ్ధిని పొందే రాశులు
అటువంటి కుజుడు తన గమనాన్ని మార్చుకొని ఉదయించడం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఏప్రిల్ 18వ తేదీన రాత్రి ఒంటిగంట 52 నిమిషాలకు కుజుడు మీన రాశిలో ఉదయిస్తాడు. మీన రాశిలో కుజుడు ఉదయం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
మీన రాశిలో కుజుడు ఉదయం ధనుస్సు రాశి జాతకులకు శుభదాయకంగా ఉంటుంది. కుజ గ్రహం ధనుస్సు రాశిలో చతుర్ద గృహంలో ఉదయిస్తున్నాడు. దీని కారణంగా ఉద్యోగాలు చేసే వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. అయితే ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించుకుంటే మంచి జరుగుతుంది. కుటుంబ వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
వృషభ రాశి
కుజుడు ఉదయం వృషభరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. వృషభ రాశిలో కుజుడు లాభ గృహంలో సంచారం చేయడం వల్ల వృషభ రాశి జాతకులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుంది. వృషభ రాశి జాతకులు ఆర్థికంగా ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం ఏ విధంగానూ మంచిది కాదు. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్చులను తగ్గించుకుంటే మంచిది.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు కుజుడు ప్రయోజనాలను చేకూరుస్తాడు. మిధున రాశిలో కుజుడు ఉదయం కర్మ భావంలో జరుగుతుంది. దీని ఫలితంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అన్ని విధాల మంచి జరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగాను ఈ సమయంలో మిధున రాశి జాతకులకు మంచి జరుగుతుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications