డిసెంబరు 2026 నెలలో అత్యంత అదృష్టవంతులైన రాశులు వీరే

జ్యోతిష్య పండితుల అంచనాల ప్రకారం, డిసెంబర్ 2026లో శని ప్రత్యక్ష గమనం డిసెంబర్ 11 నుంచి ఉంది. రాహు-కేతువుల మార్పు డిసెంబర్ 5 నుంచి, ధనుస్సు రాశిలో సూర్య-బుధుల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం కారణంగా ప్రధానంగా ఈ క్రింది రాశుల వారికి విశేషంగా అదృష్టం కలిసి రానుంది. ఆ కలిసివచ్చే రాశుల వివరాలు తెలుసుకుందాం.

మకర రాశి, కుంభరాశి, మీన రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
మకర రాశి, కుంభరాశి, మీన రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

వృషభ రాశి

లాభ స్థానంలో శని ప్రత్యక్ష సంచారం వల్ల ఆర్థికంగా మంచి ఊరట లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందడంతో పాటు, ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు మరియు కొత్త ఒప్పందాలకు ఇది అనుకూల సమయం.

తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope These are the luckiest zodiac signs in the month of December 2026

తులా రాశి

రాశ్యాధిపతి శుక్రుడు సొంత రాశిలోనే సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభ సమయం.

కుంభ రాశి

రెండో ఇంట్లో శని ప్రత్యక్ష గమనంలోకి రావడం వల్ల ధనం, పొదుపు విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలనుకునే వారికి బాగా కలిసి వస్తుంది.

మీన రాశి

ఈ రాశిలోనే శని ప్రత్యక్ష గమనంలోకి రావడం వల్ల ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.

సింహ రాశి

సూర్యుడు, బుధుడు ధనుస్సు రాశిలోకి రావడం వల్ల తెలివితేటలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి జీవితంలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+