ఏపీలో పెట్టుబడులకు భద్రత కల్పించేలా కొత్త చట్టం.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వెనుక!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్-2026'ను తీసుకురాబోతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రూపొందిస్తున్న ఈ ప్రత్యేక చట్టాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి తేవాలని కార్యాచరణ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును పరిశ్రమల శాఖ రూపొందించగా, శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులు చట్టంలోని నిబంధనలు, పెట్టుబడిదారులకు లభించే భద్రత అంశాలపై వివరణ ఇచ్చారు.

ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పరిశ్రమలకు ఇచ్చిన హామీలను భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు మార్చకుండా లేదా రద్దు చేయకుండా కట్టుదిట్టమైన చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు కేవలం రెండు వారాల్లోనే అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు.

AP Investment Protection Act 2026 to Offer Five-Point Legal Shield From April cm chandrababu master plan for investments

ప్రభుత్వం మారినప్పుడల్లా పారిశ్రామిక విధానాలు, రాయితీలు, భూకేటాయింపుల్లో మార్పులు జరుగుతాయన్న ఆందోళనను తొలగించి, పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలిక విశ్వాసాన్ని పెంచడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. కొత్త చట్టం ద్వారా పెట్టుబడులకు ఐదు కీలక అంశాలతో రక్షణ కల్పించనున్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేయకుండా స్పష్టమైన నిబంధనలు పెట్టడం, అనుమతించిన ప్రోత్సాహకాలను ఏ పరిస్థితుల్లోనూ కుదించకుండా హామీ ఇవ్వడం ఇందులో ప్రధానమైనవి.

అలాగే పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతుల్లో మార్పులు చేయకుండా చూడటం, ప్రాజెక్టులకు కేటాయించిన నీరు, ఇతర సదుపాయాల అమలులో అడ్డంకులు రాకుండా రక్షణ కల్పించడం, ఎస్క్రో విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించే నిర్ణయాలను రద్దు చేయకుండా భరోసా ఇవ్వడం వంటి ఐదు అంశాలను పొందుపరచారు. దీనికితోడు పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఎన్ని రోజుల్లోపు చెల్లించాలనే అంశంపైనా చట్టంలో స్పష్టత ఇవ్వనున్నారు.

ఈ చట్టంలోని నిబంధనల అమలులో తలెత్తే సమస్యలు, వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రభుత్వ విధానాలు లేదా ఇతర అంశాల వల్ల పారిశ్రామికవేత్తలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా ఈ కమిటీని ఆశ్రయించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

ముసాయిదా చట్టంలోని అంశాలను పరిశ్రమల శాఖ ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపింది. న్యాయ పరిశీలన అనంతరం డిసెంబరు మొదటి వారంలో ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వివిధ పారిశ్రామిక సంఘాలు, విదేశీ సంస్థలకు కూడా దీనిని పంపి సూచనలు తీసుకుంటారు. వచ్చే ఏడాది జనవరిలో తుది రూపు ఇచ్చి కేబినెట్ ఆమోదానికి పంపి, ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన తర్వాత మార్చిలో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని భావిస్తున్నారు.

2బీహెచ్‌కే కాలనీలకు తీపికబురు.. రూ.53 కోట్లతో ఆ పనులకు ప్రభుత్వం పచ్చజెండా!
2బీహెచ్‌కే కాలనీలకు తీపికబురు.. రూ.53 కోట్లతో ఆ పనులకు ప్రభుత్వం పచ్చజెండా!

అనంతరం ఏప్రిల్ నుంచి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంఓయూలు వచ్చిన నేపథ్యంలో, వాటిని క్షేత్రస్థాయిలో వేగంగా గ్రౌండింగ్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో విధానపరమైన మార్పుల వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైన అనుభవాల నేపథ్యంలో, చట్టబద్ధమైన రక్షణ కల్పించడం వల్ల దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం బలపడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఐటీ రంగాల్లో వచ్చే భారీ పెట్టుబడులకు ఈ చట్టం భరోసా ఇస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+