అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఒకట్రెండు ప్రతిపక్ష, తటస్థ పార్టీలు కూడా బిల్లు వైపే మొగ్గు చూపుతోన్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీ డీఎంకే కూడా ఈ డీలిమిటేషన్ బిల్లు పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకుంటోంది. ఈ బిల్లు ఆదివారం లోక్‌సభ సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సమావేశం అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నాయకురాలు కనిమొళి దీనికి అధ్యక్షత వహించారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

DMK ready to support delimitation bill if Tamil Nadu representation remains unchanged in Parliament

తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినకుండా ఉండటానికి పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కొన్ని షరతులను కేంద్రం ముందు ఉంచారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తమ రాష్ట్ర ప్రాతినిథ్యం తగ్గకుండా ఉంటేనే బిల్లుకు మద్దతు ఇస్తామని డీఎంకే తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను నిష్పత్తి ప్రకారం పెంచడంతో పాటు రాబోయే 25 ఏళ్ల వరకు 1971 నాటి జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!
కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!

గతంలో ఈ డీలిమిటేషన్ ప్రతిపాదనలపై డీఎంకే నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లును స్టాలిన్ గట్టిగా వ్యతిరేకించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, కొత్త జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ స్థానాలను కోల్పోతాయనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 7.18 శాతం లోక్‌సభ స్థానాల వాటా తగ్గిపోతుందని, దాదాపు 10 ఎంపీ స్థానాలను నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు
అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు

దీనికి ఎటువంటి నష్టం కలగకుండా ఉంటేనే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని, లేకపోతే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుందని డీఎంకే తేల్చి చెప్పింది. లోక్‌సభ స్థానాల సంఖ్య ఎంత పెరిగినా కూడా పార్లమెంట్‌లో తమ రాష్ట్రానికి ఉన్న ప్రస్తుతం ఉన్న 7.18 శాతం స్థానాల వాటాను ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై ప్రస్తుతానికి కేంద్రం నుంచి ఎటువంటి బదులు రాలేదని డీఎంకే వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+