మహిళా ఐఏఎస్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. కటకటాల్లోకి ఎమ్మెల్యే!

ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన కేసులో తమిళనాడులోని కళ్లకురిచ్చి నియోజకవర్గ ఎమ్మెల్యే సి.అరుళ్ విగ్నేష్‌ను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. తన నివాసంలోనే 36 ఏళ్ల విగ్నేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఎన్టీఆర్–అనిల్ రావిపూడి కాంబో వెనుక పెద్ద ప్లాన్! టాలీవుడ్‌కు గేమ్ ఛేంజర్?
ఎన్టీఆర్–అనిల్ రావిపూడి కాంబో వెనుక పెద్ద ప్లాన్! టాలీవుడ్‌కు గేమ్ ఛేంజర్?

ఫిర్యాదు నుంచి అరెస్ట్ వరకు పరిణామాలు
బాధిత మహిళా ఐఏఎస్ అధికారికంగా ఫిర్యాదు చేసిన 4 రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. తొలి ఘటన జరిగినట్లు చెబుతున్న 117 రోజుల అనంతరం పోలీసుల చర్యలు వేగవంతమయ్యాయి. అరెస్ట్ కు ముందు తనపై వచ్చిన ఆరోపణలను విగ్నేష్ ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన పేర్కొన్నారు.

Kallakurichi MLA C Arul Vignesh Arrested Over Obscene Texts to Woman IAS Officer Timeline from complaint to arrest

నవంబర్ 23న కళ్లకురిచ్చి ఎస్పీ ఐ.షెహనాజ్ ఫిర్యాదు స్వీకరించి ప్రాథమికంగా విచారణ జరిపారు. అనంతరం దర్యాప్తు నిమిత్తం సంబంధిత ఫైళ్లను అప్పగించారు. ఆ తర్వాత నవంబర్ 25న కళ్లకురిచ్చి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ భవనశ్వరి స్వయంగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. అక్కడ విగ్నేష్ కు సమన్లు అందజేసి విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఈ దర్యాప్తును ఉన్నతాధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ఐజీ ఎన్.కామిని ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

నంది అవార్డులు ఇవ్వకుంటే రాష్ట్రం ఎంత కష్టాల్లో పడుతుందో: కేతిరెడ్డి తీవ్ర విమర్శలు!
నంది అవార్డులు ఇవ్వకుంటే రాష్ట్రం ఎంత కష్టాల్లో పడుతుందో: కేతిరెడ్డి తీవ్ర విమర్శలు!

ఎమ్మెల్యే సి.అరుళ్ విగ్నేష్‌పై పోలీసులు మొత్తం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టంలోని నిబంధనలు కూడా ఉన్నాయి. దీంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని నాలుగు సెక్షన్లను(75,78, 79, 132) కూడా కేసులో చేర్చారు. లైంగిక వేధింపులు, మహిళా గౌరవానికి భంగం కలిగించడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలగించడం వంటి అంశాల కింద ఈ సెక్షన్లు వర్తిస్తాయని పోలీసులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+