డీలిమిటేషన్ బిల్లు పాసైతే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెరిగే సీట్లు ఇవే..!

కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (Delimitation bill) ఉభయసభల్లోనూ ఆమోదం పొందితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న లోక్ సభ సీట్లు 50 శాతం మేర పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమానంగా లేదని సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం ఉన్న సీట్ల 543 సీట్లు కాస్తా మరో 270 పెరిగి 813కు చేరుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రంలో, ఏయే కేంద్ర పాలిత ప్రాంతంలో లోక్ సభ సీట్లు ఎలా పెరుగుతున్నాయో ఓసారి చూద్దాం..

తెలంగాణ ఎన్నికలు ఆలస్యం? రాష్ట్రపతి పాలన- బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హింట్..!
తెలంగాణ ఎన్నికలు ఆలస్యం? రాష్ట్రపతి పాలన- బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హింట్..!

డీలిమిటేషన్ బిల్లులో కేంద్రం ప్రతీ రాష్ట్రంలో ఉన్న లోక్ సభ సీట్లను 50 శాతం పెంచాలని ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం లోక్ సభ సీట్లు ప్రస్తుతం ఉన్న 42 నుంచి 56కు చేరుకోబోతున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభజన ఎలా ఉంటుందో కేంద్రం డీలిమిటేషన్ బిల్లులో స్పష్టంగా చెప్పనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 2 సీట్లు అలాగే ఉంటాయి. అస్సాంలో 14 నుంచి 21కి, బీహార్ లో 40 నుంచి 69కి, ఛత్తీస్ ఘ్ లో 11 నుంచి 17కి పెరగనున్నాయి. గోవాలో మాత్రం 2 సీట్లు అలాగే ఉంటాయి.

Delimitation Bill State-Wise Increase in Assembly and Lok Sabha Seats If Passed
డీలిమిటేషన్ తో ఏపీకి జరిగేది ఇదే..! కేబినెట్లో తేల్చేసిన చంద్రబాబు..!
డీలిమిటేషన్ తో ఏపీకి జరిగేది ఇదే..! కేబినెట్లో తేల్చేసిన చంద్రబాబు..!

గుజరాత్ లో 26 సీట్లు కాస్తా 40కు, హర్యానాలో 10 నుంచి 17కు, హిమాచల్ ప్రదేశ్ లో 4 నుంచి 5కు, జమ్మూ, కాశ్మీర్, లఢక్ కలిపి 6 నుంచి 8కి, జార్ఖండ్ లో 14 నుంచి 22కు, కర్నాటకలో 28 నుంచి 41కి, కేరళలో 20 నుంచి 22కు, మధ్యప్రదేశ్ లో 29 నుంచి 48కి, మహారాష్ట్రలో 48 నుంచి 75కు పెరుగుతాయి. మణిపూర్ లో మాత్రం ప్రస్తుతం ఉన్న రెండు సీట్లు, మేఘాలయలో రెండు సీట్లు, మిజోరాంలో ఒక సీటు, నాగాలాండ్ లో ఒక సీటు, సిక్కింలో ఒక సీటు, త్రిపురలో 2 సీట్లు అలాగే ఉంటాయి. ఇక ఒడిశాలో 21 నుంచి 28కి, పంజాబ్ లో 13 నుంచి 19కి, రాజస్థాన్ లో 25 నుంచి 46కు, తమిళనాడులో 39 సీట్లు 48కి, యూపీలో 80 సీట్లు 133కు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు 7కి, పశ్చిమ బెంగాల్లో 42 సీట్లు 61కి పెరుగుతాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీలో 7 సీట్లు 11కు పెరుగుతాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక సీటు, చంఢీఘర్ లో ఒక సీటు, దాద్రా నగర్ హవేలీలో ఒక సీటు, డామన్ డయ్యూలో ఒక సీటు, లక్షద్వీప్ లో ఒక సీటు, పుదుచ్చేరిలో ఒక సీటు మాత్రం అలాగే ఉంటాయి.

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు, బీజేపీతో పొత్తుపై తేల్చేసిన స్టాలిన్..! 2 డిమాండ్లు..!
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు, బీజేపీతో పొత్తుపై తేల్చేసిన స్టాలిన్..! 2 డిమాండ్లు..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+