తెలంగాణ ఎన్నికలు ఆలస్యం? రాష్ట్రపతి పాలన- బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హింట్..!
తెలంగాణలో 2028 డిసెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడబోతున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman) వెల్లడించారు. ఈ ఎన్నికల్ని వాయిదా వేస్తారని, అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశం ఉందని ఆయన ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కూడా అయిన ఎంపీ లక్ష్మణ్ ఇవాళ తెలంగాణ ఎన్నికలపై కీలక సంకేతం ఇచ్చారు. 2028 డిసెంబర్ లో జరగాల్సిన ఈ ఎన్నికల్ని లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేందుకు వీలుగా ఆరు నెలలు అసెంబ్లీ గడువును ముందుకు జరిపే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఆరు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు, తర్వాత జరిగే ఎన్నికల్నీ కలిపి లోక్ సభ ఎన్నికలతో పాటే జరుగుతాయని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.














Click it and Unblock the Notifications
