ఇలాంటి కథ ఇప్పటివరకు చూడలేదు.. టాలీవుడ్‌లో మరో డిఫరెంట్ మూవీకి శ్రీకారం!

మనీష్‌, పాయల్ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'రెటీనా'. ఈ సినిమాను వైవిధ్యభరితమైన కథా కథనాలతో డైరెక్టర్ అల్లం రాజు రూపొందిస్తున్నారు. పార్వతి సినిమాస్ బ్యానర్‌పై హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ప్రొడ్యూసర్ పార్వతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Bhogi Movie Review: శర్వానంద్ 'భోగి’ రివ్యూ.. రస్టిక్ సెటప్, భారీ హైప్ మూవీ ఎలా ఉంది?
Bhogi Movie Review: శర్వానంద్ 'భోగి’ రివ్యూ.. రస్టిక్ సెటప్, భారీ హైప్ మూవీ ఎలా ఉంది?

తమ స్క్రిప్ట్ నిర్మాత పార్వతికి ఎంతో నచ్చిందని.. ఇలాంటి కథ తాను మునుపెన్నడూ వినలేదని ఆమె చెప్పడం తమకు బలాన్నించిందని డైరెక్టర్ అల్లం రాజు వెల్లడించారు. కథ విన్న వెంటనే సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో.. చక్కటి భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. హర్ష ప్రవీణ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని.. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెటీనా మంచి కథాంశంతో వస్తున్న చిత్రమని నిర్మాత పార్వతి పేర్కొన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు వెల్లడించారు.

Retina Movie Inspired by Real Incidents Cast and Crew Share Insights in Hyderabad Full Details Here
నితిన్ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ రిలీజ్.. ఈసారి హిట్ కొట్టేట్టు ఉన్నాడే..!
నితిన్ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ రిలీజ్.. ఈసారి హిట్ కొట్టేట్టు ఉన్నాడే..!

హీరో మనీష్ మాట్లాడుతూ.. పాట తరహాలోనే సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంచి స్టోరీతో ప్రేక్షకులకు మెరుగైన సినిమా అందించాలన్న డైరెక్టర్ తపనకు ఈ సినిమాతో సరైన అవకాశం దక్కిందని.. ఇండస్ట్రీలో ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. రిలీజ్ అయిన పాట ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నట్లు హీరోయిన్ పాయల్ ముఖర్జీ చెప్పారు. కథ విన్న వెంటనే ఇందులో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తాను కొత్త అయినప్పటికీ.. సినిమా బృందం ఎంతో సహకరించిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+