నితిన్ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ రిలీజ్.. ఈసారి హిట్ కొట్టేట్టు ఉన్నాడే..!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస ప్లాఫ్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా ఆఫియా సయ్యద్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురళీ కృష్ణ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. చూస్తుంటే అలియాస్ రుక్మిణి మూవీతో నితిన్ కమ్ బ్యాక్ ఇవ్వనున్నట్లు స్పష్టం అవుతోంది.

అందరికీ నమస్కారం.. ఈ రోజు జరిగే నాటకం పేరు ది మ్యాంగో కింగ్.. ఈ నాటకం ఎవ్వరినీ ఉద్దేశించింది కాదు.. అనే మాటలతో సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ కోర్టులో పనిచేసే స్టెనోగ్రాఫర్ కు ఇలాంటి కలలు రావడం ఏంటి..? విచిత్రంగా ఉంది.. మీరేదో దాస్తున్నారు.. అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కోరికలే గుర్రాలైతే.. మిస్టర్ వీర్యం ఛీఛీ ఇవి చదువుతున్నాడా.. ? చదవట్లేదు.. రాస్తున్నాడు.. అనే డైలాగ్ బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి.. కృష్ణ అనా..? లేక రుక్మిణి అనా..? అని హీరోయిన్ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచడమే కాదు.. మూవీలో ఏదో భారీ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగింది. సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఇక ఈ మూవీ ట్రైలర్ లో వెనక గోడలపై వర్షం, వెంకీ, ఆంధ్రావాలా, పెదబాబు వంటి అప్పటి సినిమాల పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలియాస్ రుక్మిణి మూవీ 2000 దశకం నేపథ్యంలో సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. కళ్లకు కళ్లద్దాలు పెట్టుకుని.. అమాయకమైన లుక్స్ తో ఈ సినిమాలో నితిన్ కనిపిస్తున్నారు.. కానీ ఆయన ఏదో దాస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అది సినిమాలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ అని కనిపిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications
