ఏపీకి మళ్లీ వర్ష సూచన- రేపు ఈ జిల్లాల్లో అలర్ట్..!

ఏపీని మరోసారి వర్షాలు పలకరించబోతున్నాయి. తాజాగా నెల రోజుల గ్యాప్ లోనే మూడు తుఫాన్లు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వర్ష సంకేతాలు (Rain Alert) అందుతున్నాయి. ఈ మేరకు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో రేపు వర్షాలు కురవబోతున్నాయో వివరాలను వెల్లడించింది. అలాగే ఇవాళ సాయంత్రం వరకూ వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాల వివరాలను కూడా విడుదల చేసింది.

కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

రాష్ట్రంలో రేపు అంటే శుక్రవారం నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని ప్రజలకు సూచించారు. ఈ మేరకు వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

APSDMA Issues Rain Alert for Several Andhra Pradesh Districts for Tomorrow
ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు- ఈ జిల్లాల్లో ..!
ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు- ఈ జిల్లాల్లో ..!

మరోవైపు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరు(జి) తెనాలిలో 29.4మిమీ, నెల్లూరు(జి) ఇందుకూరుపేటలో 25మిమీ, తిరుపతి(జి) పుత్తూరులో 21మిమీ, గుంటూరు(జి) వడ్లమూడిలో 20.8మిమీ, నెల్లూరు రూరల్ లో 20మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పంటలకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చని అంచనా. ఇప్పటికే తుఫాన్ల వల్ల భారీ ఎత్తున పంటలు నష్టపోయిన రాష్ట్ర రైతులకు ఈ వర్షాలతో ఇబ్బందులు ఉండవల్ల సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఆ మేరకు రైతులకు ఊరట అని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+