రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య!

ఇటీవల మగవాళ్ళ కంటే మహిళల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ముఖ్యంగా భార్యలు, భర్తలను హతమారుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఓ భార్య భర్తను హతమార్చిన కేసు స్థానికులను నివ్వెరపరిచింది. తాళి కట్టిన భర్త ప్రాణాలనే పణంగా పెట్టి, ప్రియుడితో కలిసి భార్య పన్నిన కుట్ర పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్టు ముంపు పరిహారంగా అందిన రూ.18 లక్షలపై ఆశే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన మల్లికార్జున్ పశువులను మేపుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన అంజమ్మతో అతడికి పెళ్లయింది. సుమారు రెండు నెలల క్రితం శ్రీశైలం వెళ్తున్న బస్సులో మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి మల్లికార్జున్‌కు పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారడంతో శివ తరచూ వారి ఇంటికి రాసాగాడు. ఈ రాకపోకల్లోనే అంజమ్మతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడిందని విచారణలో తేలింది.

Rangareddy murder case Wife and Lover Kill Husband Over Rs 18 Lakh Reservoir Compensation in Madgul

అదే సమయంలో ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితుడిగా మల్లికార్జున్‌కు రూ.18 లక్షల పరిహారం అందింది. భర్త అడ్డు తొలగితే తమ బంధానికి ఆటంకం ఉండదని, ఆ డబ్బునూ సమానంగా పంచుకోవచ్చని ఇద్దరూ లెక్కలు వేసుకున్నారు. అలా హత్యకు పథకం సిద్ధమైంది. ఈ నెల 20న శివ ఆ పథకాన్ని అమలు చేశాడు. కూలి పని ఉందని ఫోన్ చేసి మల్లికార్జున్‌ను అవురుపల్లి శివారుకు రప్పించాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. మత్తులో ఉన్న మల్లికార్జున్‌పై శివ బండరాయితో దాడి చేసి చంపేసి, అక్కడి నుంచి పరారయ్యాడు.

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షాక్.. జనవరి 28న హాజరుకు మేడ్చల్ కోర్టు సమన్లు!
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షాక్.. జనవరి 28న హాజరుకు మేడ్చల్ కోర్టు సమన్లు!

మూడు రోజుల తర్వాత అటువైపు వెళ్లిన కూలీలు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, తర్వాత మృతుడిని మల్లికార్జున్‌గా గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయగా భార్య అంజమ్మ, ఆమె ప్రియుడు శివ పాత్ర బయటపడింది. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+