జగన్ సొంత ఊరులో టీడీపీ గెలుపు - 40 ఏళ్ల తర్వాత..!!

మాజీ సీఎం జగన్ సొంత ఊరులో టీడీపీ విజయం సాధించింది. స్థానిక ఎన్నికల్లో పులివెందుల మున్సిపాల్టీ..పులివెందుల జెడ్పీటీసీ.. కడప జడ్పీ ని టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లోనూ జగన్ సొంత ఊరు బలపనూరులో కూటమి బలపర్చిన అభ్యర్ది విజయం సాధించ టం రాజకీయంగా ఆసక్తిగా మారింది. తొలి నుంచి పులివెందుల నియోజకవర్గం పైన స్థానిక ఎన్నిక ల్లో విజయం కోసం టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇక, 40 ఏళ్ల తరువాత ఈ పంచాయితీ టీడీపీ దక్కించుకుంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గంలోని సొంత ఊరు పంచాయితీ ఇప్పుడు టీడీపీ ఖాతాలో జమ అయింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బలపనూరు పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. జగన్ సొంత గ్రామమైన బలపనూరు (సింహాద్రిపురం మండలం) సర్పంచిగా టీడీపీ మద్దతుదారుడు కొత్తరెడ్డి అనిల్‌ కుమార్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ పంచాయతీలో టీడీపీ మద్దతుతో సర్పంచి పీఠాన్ని దక్కించుకుంది. .బలపనూరు గ్రామంలో మొత్తం 2,269 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఇక్కడ సర్పంచి ఎన్నికలు ఎప్పుడూ హోరాహోరీగా సాగేవి. అయితే ఈసారి వైసీపీ తరపున ఎవరూ నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. కూటమి తరపున అనిల్‌కుమార్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

 శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!
శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!
tdp-backed-candidate-win-in-jagan-s-native-village-balapanur-panchayat-elections-details-here

40 ఏళ్ల తరువాత విజయం

కాగా, ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ బలపనూరు పరిధిలోని స్థానాన్ని అనిల్‌కుమార్‌రెడ్డి కుటుంబానికే చెందిన కొత్తరెడ్డి రవిచంద్రారెడ్డి ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. దీంతో అటు ఎంపీటీసీ, ఇటు సర్పంచి పదవులు రెండూ ఒకే కుటుంబానికి దక్కాయి. అయితే, బలపనూరుతో పాటు సింహాద్రిపురం మండలం మొత్తం కూటమి హవా కనిపించింది. మండలంలోని మొత్తం 20 పంచాయతీల్లో 18 స్థానాలను కూటమి మద్దతుదారులే ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. జగన్ సొంత గ్రామంలోన నాలుగు దశాబ్దాల తర్వాత టీడీపీ మద్దతుదారుడు సర్పంచిగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ గెలుపుతో స్థానిక ఎన్నికల్లో పంచాయితీ నుంచి జెడ్పీ పీఠం వరకు పూర్తిగా కూటమి కైవసం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+