డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు- ఎన్నికల కారణంగా..!

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ (NTR Bharosa Pension) మొత్తాల్ని ప్రతీ నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు. కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల ముందురోజే పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు. ఈసారి డిసెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలోనూ ఓ మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. అలాగే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఇంకా జరగాల్సి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈసారి పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం స్పల్ప మార్పు చేసింది.

కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగులు పలువురు ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో వీరు పింఛన్లను పంపిణీ చేసే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ప్రభుత్వం వీరికి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో ఓ వెసులుబాటు ఇచ్చింది. ఈ నెల 30 తేదీన బ్యాంకుల నుంచి నగదు తీసుకుని, అదే రోజు లేదా డిసెంబర్ 1న పంపిణీ చేయొచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 30న ఎన్నికల విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ 1న నగదు విత్ డ్రా చేసుకుని, అదే రోజు లబ్దిదారులకు పంపిణీ చేయొచ్చని తెలిపింది. దీంతో సచివాలయ ఉద్యోగులు ఈ రెండు తేదీల్లో పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నారు.

NTR Bharosa Pension Important Update for Beneficiaries as December Distribution Dates Change

చిత్తూరు లోక్ సభ ఎన్నికల్లో 31417 ఓట్ల గల్లంతు ? తేల్చేసిన ఏపీ సర్కార్.. !

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం సచివాలయ ఉద్యోగులు స్దానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనని చోట నవంబర్ 30న పెన్షన్ల పంపిణీ జరగనుంది. నవంబర్ 30న సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటే మాత్రం ఆయా ప్రాంతాల్లో డిసెంబర్ 1న పెన్షన్ల పంపిణీ జరగబోతోంది. కాబట్టి ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులు నవంబర్ 30న తమ పింఛన్ అందకపోతే డిసెంబర్ 1న అందుతుందని గమనించాల్సి ఉంటుంది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడమే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+