రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?

ప్రతీ ఇంటా క్యారెట్ ఉంటుంది. ఆహారంగానే కాదు.. ఆరోగ్య పరంగానూ క్యారెట్ మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల విటమిన్లు.. పోషకాలు ఉంటాయి. చాలా మంది క్యారెట్ పచ్చిగా తినేందుకు ఇష్టపడతారు. క్యారెట్ ద్వారా విటమిన్ A (బీటా-కెరోటిన్), ఫైబర్, పొటాషియం, విటమిన్ C, విటమిన్ K మరియు యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. అయితే, క్యారెట్ తీసుకునే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు అందిస్తున్నారు. అదే విధంగా జాగ్రత్తల పైన సూచిస్తున్నారు.

క్యారెట్‌ను ప్రతిరోజూ తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి క్యారెట్లు తింటే.. శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కంట్రోల్‌లో ఉంటుంది. వాస్తవానికి, అదనపు ఈస్ట్రోజెన్ మెటిమలు, ఒత్తిడి సహా ఇతర హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడంలో క్యారెట్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే, పచ్చి క్యారెట్లు కడుపులోని చెడు బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. క్యారెట్‌లో కేలరీలు తక్కువగా, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విటమిన్ ఏ అందిస్తుంది. కళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు విటమిన్ ఏ చాలా అవసరం. క్యారెట్లను బాగా కడిగి సలాడ్ రూపంలో తింటే మంచిది. ఇందులో దోసకాయ, టమాటా, బీట్‌రూట్ కలుపుకోవచ్చు. క్యారెట్ జ్యూస్ కూడా తాగవచ్చు.

ఈ ఆకు టీ తాగితే షుగర్, కొలెస్ట్రాల్‌ కంట్రోల్ - క్యాన్సర్ రాకుండా..!!
ఈ ఆకు టీ తాగితే షుగర్, కొలెస్ట్రాల్‌ కంట్రోల్ - క్యాన్సర్ రాకుండా..!!
carrot-consumption-offers-benefits-for-eye-health-digestion-and-heart-here-the-report

నిపుణుల సూచనలు

అయితే, జ్యూస్ కంటే సలాడ్ లాగా తింటేనే ఎక్కువ ఫైబర్ వస్తుంది. కాగా, బీటా- కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. విటమిన్ ఏ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ థైరాయిడ్ పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ దండిగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్ ఒక వరమని చెప్పాలి. క్యారెట్‌లో క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గుతారు. ఇది అనవసర కొవ్వును తగ్గిస్తుంది. క్యారెట్లలో ఫాల్కరినాల్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మహిళలకు మేలు చేస్తాయని, వారి ఆరోగ్యాన్ని రక్షిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. పలు హార్మోన్ల సమస్యలను ఈ కూరగాయ దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక వ్యవస్థ పనితీరును విటమిన్ ఏ మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ పొందేందుకు క్యారెట్ ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+