శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!
తిరుమలలో కొత్త చరిత్ర. శ్రీవారికి ఏకంగా 121 కిలోల బంగారం కానుక. 46 స్వర్ణాభరణాలతో విరాళం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో కానుకగా ఇచ్చిన భక్తుడి గురించి ఆసక్తి పెరుగుతోంది. అయితే, ఆయన పేరు వర్దమాన్ జైన్. చెన్నైకు చెందిన ఈయన గతంలోనూ టీటీడీకి భారీ స్థాయిలో విరాళాలు అందించారు. ఈ రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కోట్ల విలువైన బంగారం సమర్పించారు. కాగా, వ్యాపార రంగంలో రాణించిన వర్దమాన్ జైన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి.
శ్రీవారికి 121 కోట్ల విలువైన బంగారం అందించిన వర్దమాన్ జైన్ చెన్నై కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్నారు. చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీ నుంచి స్టాటిస్టిక్స్‌లో పట్టభద్రుడైన వర్థమాన్ జైన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. వ్యాపారవేత్తగానే కాకుండా చెన్నై ఏంజెల్స్ సభ్యుడిగా పలు భారతీయ స్టార్టప్ కంపెనీల్లో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా పెట్టుబడులు పెడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఏషియా ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా, క్విబస్ రిసోర్సెస్ బోర్డు సభ్యుడిగా కార్పొరేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హెల్త్‌కేర్ బీపీఓ , ఐటీ, నిర్మాణ రంగాల్లో ఆయన అగ్రగామిగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకుడిగా, వైస్ ఛైర్మన్‌గా ఆయన వేలాది మందికి ఉపాధి కల్పించారు.

టీటీడీ చరిత్రలో భారీ విరాళం
కాగా, వర్దమాన్ జైన్ గతంలో పెరోట్ సిస్టమ్స్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ సంస్థ డెల్ సర్వీసెస్‌లో విలీనమయ్యే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. సుమారు రూ. 8,292 కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. తన కంపెనీలో 60% వాటా విక్రయించడంతో రూ.6వేల కోట్లు వచ్చాయని, అందులో నుంచి 121 KGల బంగారం విరాళంగా ఇస్తున్నారని గతంలోనే సీఎం చంద్రబాబు వెల్లడించారు. చెన్నై టి.నగర్‌లోని టీటీడీ ఆలయ విస్తరణకు రూ. 1.02 కోట్లు, టీటీడీ ట్రస్టులకు రూ. 6 కోట్ల విరాళాలు ఇచ్చిన వర్థమాన్ జైన్ చెన్నైలోని కాంచీ కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా సేవలు అందిస్తున్నారు. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2025లో SV భక్తి ఛానలకు రూ.5 కోట్లు, గో సంరక్షణకు రూ.కోటి అందజేశారు. మే 2026లో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్ విరాళంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
