శ్రీవారికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఈయనే- ఇది తొలి సారి కాదు, గతంలోనూ..!!

తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం. తొలి సారి ఏకంగా 121 కిలోల బంగారం విరాళం. ఇప్పటి వరకు భక్తుడు వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచారు. గత ఏడాది సీఎం చంద్రబాబు ఈ విరాళం గురించి వెల్లడించారు. తన కంపెనీలో వాటా విక్రయంతో వచ్చిన మొత్తంలో కొంత శ్రీవారికి బంగారం రూపంలో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు టీటీడీకి 121 కిలోల బంగారం అందచేసారు. సీఎం చంద్రబాబు సైతం ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ భక్తుడు శ్రీవారికి విరాళం ఇదే తొలి సారి కాదు.. గతంలోనూ పలు మార్లు విరాళాలు అందించారు.

తిరుమల శ్రీవారి చెంతకు 121 కిలోల బంగారం.. స్వర్ణాభరణాలు చేరాయి. కొంత కాలంగా ఆ విరాళం పైన భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ఎవరు ఈ భక్తుడు అనే చర్చ కొనసాగింది. కాగా, ఈ రోజు శ్రీవారి దర్శనం చేసుకొని ఈ భారీ విరాళం టీటీడీకి అందచేయటంతో ఆ భక్తుడు వివరాలు బయటకు వచ్చాయి. తిరుమల శ్రీవారికి చెన్నైకి వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ అనే భక్తుడు భారీ విరాళం సమర్పించారు. 121 కిలోల బంగారు ఆభరణాలను ఈవోకు అందజేశారు. శ్రీవారికి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే అని రకాల మొత్తం 46 బంగారు ఆభరణాలను ఆయన విరాళం గా అందించారు. గతంలో 2025 జనవరి 19 రూ.6 కోట్లు, ఈ ఏడాది మే 16న ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించినట్లు టీటీడీ అధికారులు గుర్తు చేసారు.

 తిరుమల చేరిన 121 కిలోల బంగారం, శ్రీవారి ఆభరణాలివీ - నేడే.. ఎవరీ భక్తుడు..!!
తిరుమల చేరిన 121 కిలోల బంగారం, శ్రీవారి ఆభరణాలివీ - నేడే.. ఎవరీ భక్తుడు..!!
ttd-receives-huge-donation-from-chennai-devotee-vardhaman-jain-about-121-kg-gold-ornaments-details

గతంలోనూ టీటీడీకి విరాళాలు

తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ విరాళం అందచేసారు. ఆయన తన కంపెనీలో 60% వాటా విక్రయించడంతో రూ.6వేల కోట్లు వచ్చాయని, అందులో నుంచి 121 KGల బంగారం విరాళంగా ఇస్తున్నారని గతంలోనే సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ రోజు చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీకి ఈ కానుక అందచేసారు. కాగా.. ఈ భక్తుడు టీటీడీ అధికారులు, అర్చకులు, బొక్కసం అధికారుల సూచనల మేరకు శ్రీవారికి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు ఇలా దాదాపు 46 రకాల ఆభరణాలను ఓ జ్యువెలరీ సంస్థ ద్వారా దాత తయారు చేయించారు. ఈ ఆభరణాల ప్రదర్శన కోసం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో చెక్కలతో వేదికను రాత్రి సిద్ధం చేశారు. రేపు (శుక్రవారం) అభిషేకం తరువాత స్వామి వారికి ఈ స్వర్ణాభరాలను అలంకరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+